CM Revanth Reddy : చట్టం ముందు అంద‌రు ఒక్క‌టే అంటున్న రేవంత్ ప్రభుత్వం.. ప్రజల్లో పెరుగుతున్న మద్ధతు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

CM Revanth Reddy : చట్టం ముందు అంద‌రు ఒక్క‌టే అంటున్న రేవంత్ ప్రభుత్వం.. ప్రజల్లో పెరుగుతున్న మద్ధతు..!

 Authored By ramu | The Telugu News | Updated on :15 December 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  CM Revanth Reddy  : చట్టం ముందు అంద‌రు ఒక్క‌టే అంటున్న రేవంత్ ప్రభుత్వం.. ప్రజల్లో పెరుగుతున్న మద్ధతు..!

CM Revanth Reddy  : అల్లు అర్జున్ అరెస్ట్ కి ప్రధాన కారణం సీఎం రేవంత్ రెడ్డి ఈగో హర్ట్ అయినందుకే అని ప్రధాన మీడియా అంతా చెబుతున్న విషయం తెలిసిందే. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా మహిళ మృతికి అల్లు అర్జున్ కారణమంటూ కేసు ఫైల్ అవ్వగా అల్లు అర్జున్ ని హుటాహుటిన అరెస్టు చేసి చంచల్ గూడా జైలుకి పంపించే ఏర్పాటు చేశారు. అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడం వల్ల కేవలం 12 గంటలు మాత్రమే జైల్లో ఉండి తర్వాత అల్లు అర్జున్ ఇంటికి వచ్చేసాడు.  ఈ మొత్తం వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి చేసింది తప్పు అంటూ కొందరు అంటున్నారు. కానీ ఢిల్లీలో అల్లు అర్జున్ అరెస్టు గురించి సీఎం రేవంత్ రెడ్డి అతని అరెస్టు గురించి ఆలోచిస్తున్నారు కానీ అక్కడ ఒక మహిళ చనిపోయింది ఆమె కొడుకు చావు బతుకులో ఉన్నాడు దాని గురించి ఎవరు మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. అయితే పార్టీలకతీతంగా అల్లు అర్జున్ ని సపోర్ట్ చేసిన వారు కనిపిస్తున్నారు. మరోపక్క రేవంత్ రెడ్డి గురించి కూడా పాజిటివ్గా స్పందిస్తున్న వారు ఉన్నారు.

CM Revanth Reddy చట్టం ముందు అంద‌రు ఒక్క‌టే అంటున్న రేవంత్ ప్రభుత్వం ప్రజల్లో పెరుగుతున్న మద్ధతు

CM Revanth Reddy  : చట్టం ముందు అంద‌రు ఒక్క‌టే అంటున్న రేవంత్ ప్రభుత్వం.. ప్రజల్లో పెరుగుతున్న మద్ధతు..!

CM Revanth Reddy  ఎన్ కన్వెన్షన్ ని ఎలాంటి సెకండ్ డౌట్ లేకుండా..

ఎందుకంటే చట్టం ఎవరికైనా ఒకటే అనే విధంగా రేవంత్ రెడ్డి పరిపాలన ఉందని కొందరు చెబుతున్నారు. హైడ్రా కూల్చివేతల్లో భాగంగా ఎన్ కన్వెన్షన్ ని ఎలాంటి సెకండ్ డౌట్ లేకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చేసింది. నాగార్జునదే N కన్వెన్షన్ అన్న విషయం రేవంత్ రెడ్డికి తెలుసు. అయినా కూడా ఆ విషయంలో వెనక్కి తగ్గలేదు రేవంత్ రెడ్డి. ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో కూడా చట్టం తన పని తాను చేసుకోపోతుందని అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు.

మరోపక్క లేటెస్ట్ గా జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ రోడ్డు వెడల్పులో భాగంగా బాలకృష్ణ ఇంటికి కూడా మార్క్ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే రేవంత్ రెడ్డి నెక్స్ట్ టార్గెట్ బాలకృష్ణ అని స్పష్టంగా అర్థమవుతుంది. ఆయనతోపాటు కాంగ్రెస్ మాజీ నేత జానారెడ్డి ఇంటికి కూడా జిహెచ్ఎంసి అధికారులు మార్కు వేసినట్టు తెలుస్తుంది. బాలకృష్ణ ఇంటిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చేసే ప్రయత్నం చేస్తుందా.. ఓ పక్క ఏపీలో సీఎం చంద్రబాబు ఉండగా బాలకృష్ణని రేవంత్ రెడ్డి టచ్ చేస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా సినిమా తారల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఈ కఠిన చర్యల మీద సామాన్య మానవులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులకు ఒక రూల్ సెలబ్రిటీలకు ఒక రూల్ అన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాటించట్లేదని వాళ్లు భావిస్తున్నారు. ఇది ఒక రకంగా రేవంత్ రెడ్డికి కలిసి వచ్చే అంశమే అని చెప్పొచ్చు. CM Revanth Reddy, Allu Arjun, Balakrishna

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది