
CM Revanth Reddy : అనగనగా ఒక ఆటో రాముడు.. అగ్గిపెట్ట హరీష్..' కేటీఆర్, హరీష్ రావు పై ఫన్నీ కామెంట్స్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి..!
CM Revanth Reddy : తెలంగాణలో ఆటో డ్రైవర్ల సమస్య అసెంబ్లీని కుదిపేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి ఆటోలో వచ్చిన సంగతి తెలిసిందే. ఇక సభలోను ఆటో కార్మికుల సమస్యలపై చర్చ జరిగింది. ఆటో కార్మికుల సమస్యలను బీఆర్ఎస్ నేతలు లేవనెత్తారు. వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చనిపోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఆటో డ్రైవర్లకు నెలకు 10వేల ఆర్థిక సహాయం అందించాలన్నారు. అయితే ఆటో డ్రైవర్ల సమస్యలపై ప్రస్తావించిన బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్స్ వేశారు. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సౌకర్యాన్ని మహిళల కోసం తీసుకొచ్చామని రేవంత్ రెడ్డి పునరుద్గాటించారు. కానీ ఆటో డ్రైవర్లకు నష్టం జరుగుతుందని ప్రతిపక్ష సభ్యులు అనడం సబబు కాదన్నారు. డ్రైవర్ల కష్టాలు తెలుసుకునేందుకు మాజీ మంత్రి కేటీఆర్ ఇటీవల ఆటోలో ప్రయాణించిన విషయాన్ని ప్రస్తావిస్తూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..
కృష్ణానగర్ లో ఒకాయన ఆటో రాముడు ఉన్నాడని, అక్కడ మొత్తం సినిమాకు సంబంధించిన వాళ్ళు సురభి నాటకాలు వేసే వాళ్ళు, జూనియర్ ఆర్టిస్టులు ఉంటారని కేటీఆర్ ని ఉద్దేశిస్తూ అన్నారు. బీఆర్ఎస్ కు చెందిన ఒక జూనియర్ ఆర్టిస్ట్ అక్కడేదో సమావేశానికి వెళ్లారని, అక్కడ ఆటో కనిపించిందని, ఆటో రాముడు ఆటో ఎక్కి ఆఫీస్ కి పోయాడని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఆటో లోపల కెమెరా పెట్టారని అతడు ఎక్కింది దిగింది షూటింగ్ చేయడానికి ఈ కెమెరాను అమర్చారని అన్నారు. ఏంది ఈ డ్రామాలు .. తెలంగాణ సమాజంలోని ఆడబిడ్డలను అక్కున చేర్చుకోవాలని ఉద్దేశంతో మంచి ఆలోచనతో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పించాం. 2014 నుంచి 2019 మంత్రివర్గంలో ఒక్క ఆడబిడ్డకు కూడా మంత్రి పదవి ఇవ్వకపోయినా అక్కడ ఉన్న వాళ్ళు ఏ రోజు కూడా ఎందుకు ఇవ్వలేదని అడగలేదు ఆ సాహసం చేస్తే ఉన్న ఉద్యోగం కూడా ఊడుతుందని సంగతి వాళ్లకు తెలుసు కాబట్టి అడగలేదు.
ఆ ప్రభుత్వం మహిళలకు మంత్రి పదవులు ఇవ్వకపోయినా కోట్లాదిమంది ఆడబిడ్డల కోసం మా మంత్రి పొన్నం ప్రభాకర్, మేము ఉచిత బస్సు ప్రయాణాన్ని మొదలుపెట్టాం. ఇప్పటివరకు దాదాపు 15 కోట్ల 21 లక్షల మంది ఆడబిడ్డలు ప్రయాణించారు. 535.52 కోట్లు ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఖర్చు పెట్టింది. ఒక మంచి పని చేసినప్పుడు అభినందించడానికి నోరు రాకపోయినా పర్వాలేదు కానీ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతూ ఒక ఆటోని తీసుకొచ్చి తగలబెట్టడం సరికాదు. కిరాయి డబ్బులే రావడం లేదు, సంసారం నడవడం లేదన్న ఆటో డ్రైవర్ ఆటోని తగలబెట్టాడంటే అతడికి ఎన్ని డబ్బులు కావాలి. ఇలాంటి చర్యల ద్వారా తెలంగాణ సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకున్నారు. ఇంకో నటుడు ఏమో 100 రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కుంటాడు కానీ పది పైసలు అగ్గిపెట్టె కొనుక్కోవడం అతడికి అగ్గిపుల్ల దొరకదు అని సీఎం రేవంత్ రెడ్డి వ్యంగంగా వ్యాఖ్యానించారు.
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
This website uses cookies.