Viral Video : ప్రస్తుత కాలంలో హైదరాబాద్ నగరంలో జులాయిగాళ్ళ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. రద్దీగా ఉన్న రోడ్లపై కూడా బైక్ తీసుకుని వచ్చి స్టంట్స్ చేస్తూ వాహనాదాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.అంతేకాక రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నారు. అయితే కొందరు ఆకతాయిలు చేసే ఇలాంటి పనుల వలన రోడ్డు ప్రమాదాలు భారీగా పెరుగుతున్నాయి అని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా రోడ్లపై స్టంట్స్ చేసే కుర్రాళ్ళ బెండు తీశారు హైదరాబాద్ పోలీసులు. తాజాగా జాతీయ రహదారిపై ప్రమాదకర బైక్ స్టంట్స్ చేస్తూ కనిపించిన ఆరుగురు యువకులను హైదరాబాద్ రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరు హైదరాబాదులోని టీ-హబ్ సమీపంలో ద్విచక్ర వాహనాలతో ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ తోటి ప్రయాణికులను ఇబ్బందికి గురి చేశారు. ఇక దానికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .
ఇక ఈ వీడియోను గమనించినట్లయితే 15 సెకండ్ల క్లిప్ లో యువకులు హైవే మధ్యలో ప్రమాదకరమైన రీతిలో స్టంట్స్ ఎలా చేస్తున్నారో చూడవచ్చు. అయితే సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవడంతో రంగంలోకి దిగిన పోలీసులు స్టంట్స్ చేస్తున్న ఆరుగురు యువకులను అరెస్టు చేశారు. అంతేకాక రెండు బైక్ లను కూడా వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవడంతో పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి పోకిరిల వలనే అమాయకులు రోడ్డు ప్రమాదులకు గురవుతున్నారని ఇలాంటి వారిపై కఠిన చర్యలు పోలీసు లను కోరుతున్నారు. ఇలా నడిరోడ్డుపై స్టంట్స్ చేసే వారిపై పోలీసులు నిగా పెట్టాలని కోరుతున్నారు.
ఇది ఇలా ఉంటే ఇంతకుముందు కూడా నడిరోడ్డుపై స్టంట్స్ చేస్తూ ప్రయాణికులను ఇబ్బందికి గురి చేసిన వారిని పోలీసులు అరెస్టు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయినప్పటికీ కూడా నేటి తరం యువకులు మాత్రం ఇలాంటి స్టంట్స్ రోడ్డుపై చేస్తూనే ఉండడం ఆందోళన కలిగిస్తుంది అని చెప్పాలి. యువకులు ఇలాంటి ప్రమాదకరమైన పనులు చేయకుండా ఉండాలంటే ముందుగా వారి తల్లిదండ్రులు దీనిపై కఠినంగా వ్యవహరించాలని పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.