#image_title
CM Revanth Reddy : బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని అపవాదనలు కేసీఆర్ గట్టిగానే మూట కట్టుకున్నారు. సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని దిశా హీనంగా నడిపారని, గత పదేళ్ల నుంచి హైదరాబాద్ తప్పితే ఎక్కడ రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని, కేసీఆర్ కుటుంబ అవినీతిని కోర్ట్ కి ఈడ్చుతామని ప్రగల్బాలు పలికిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎందుకు చప్పబడిపోయారనే అభిప్రాయం ప్రజలలో వ్యక్తమవుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆర్థిక మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై కామెంట్స్ చేశారు. విద్యుత్ రంగం ఎటు పోతుందో అని కాంగ్రెస్ పార్టీ శ్వేత పత్రం విడుదల చేస్తామని తెలిపారు. అయితే అది కేవలం తూ తూ మంత్రంగానే తయారైంది. శ్వేత పత్రం తప్పులు తడకగా ఉందని ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆరోపించినప్పటికీ కాంగ్రెస్ వైపు నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఇక కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. దానిపై కాంగ్రెస్ రీ కౌంటర్ ఇవ్వలేకపోయింది. మళ్లీ కేసిఆర్ అధికారంలోకి వస్తాడని 22 కార్లు కొన్నాడని, విజయవాడ వర్క్ షాప్ లో పెట్టారని రేవంత్ రెడ్డి అన్నారు. అంతే తప్ప ఎంతమేరకు స్కామ్ జరిగిందో చెప్పలేదు. 6 గ్యారంటీలు అంటూ మొదటగా రెండు గ్యారంటీలని అమలు చేశారు.
అందులో తక్షణమే ఖజానా నుంచి బయటికి వెళ్ళని పథకాలను అమలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచారు. అయితే బస్సు ప్రయాణం పై అధ్యయనం లేకుండా తొందరపాటుగా అమలు చేశారని చెడ్డ పేరు వచ్చింది. కొన్నిచోట్ల మహిళలు విపరీతంగా ఎక్కడంతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. కెపాసిటీకి మించి బస్సు ప్రయాణం కష్టమవుతుంది. మగవారు, పిల్లలు ఎక్కే పరిస్థితి కనబడటం లేదు. దీంతో మగవారికి వేరే బస్సులు వేస్తామని చెప్పారు. అవి ఎప్పుడు వేస్తారో చెప్పలేదు. ఆరోగ్యశ్రీ నిర్వహణ సరిగా లేదు జాబితాలో ఉన్న ఆసుపత్రులకు సకాలంలో బిల్లులు అందడం లేదు. అలాంటప్పుడు గరిష్ట పరిమితి పెంచి ప్రయోజనం ఏముంటుంది. పథకాల దరఖాస్తులకు అప్లై చేసుకోవాలని పేపర్లో అప్లికేషన్ ఫారం అని ఫుల్ పేజీని ప్రకటన వేయించారు. అదేదో ఆన్లైన్ లో పెడితే సరిపోతుంది కదా. ప్రతిపక్షంలో ఉన్న స్కామ్ లను ఏఏ అంశాలలో చూపించారో వాటిని నిరూపించే ప్రక్రియ వేగం పుంజుకోలేదు. మేడిగడ్డ పొంగినప్పుడు కాంగ్రెస్ సరైన రీతిలో స్పందించలేదు అని అపవాదన ఉంది. విద్యుత్ శాఖ పనితీరుపై అడిగే వారు లేరు.
రైతులకు ఎన్ని గంటల విద్యుత్ అందుతుందని చెప్పేవారు లేరు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలు ఏంటో ఎవరికి అర్థం కావడం లేదు. కొంత కంపెనీలు రావటం లేదు. ఉన్న కంపెనీలు పోతున్నాయి. కేటీఆర్ ఉన్నప్పుడు పరుగులు పెట్టిన ఐటీ సెక్టార్ డల్ అయిపోయింది. అలాగే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కిందకి దిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఉద్యోగ అవకాశాలు ఇచ్చే అవకాశం కూడా కనబడడం లేదు. గ్రూపు పరీక్ష నిర్వహణ షెడ్యూల్ ఎప్పుడో చెప్పలేదు. ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఏళ్ల తరబడి చూస్తున్న యువతకి గుడ్ న్యూస్ చెప్పడం లేదు. ప్రజలకు తక్షణమే మేలు జరగాల్సిన చర్యలు తీసుకోవాల్సిన రేవంత్ సర్కార్ అలాంటి పనులు చేయకుండా 100 ఎకరాలు హైకోర్టు కడతాం.. శాసనమండలి నిర్మాణం చేస్తామని ప్రకటిస్తుంది. గట్టిగా విమర్శలు వస్తే అలా కాదు ఇలా అని చెబుతుంది తప్ప చివరకు ఏం చేసినా దాఖలాలు కనిపించడం లేదు. మరి తెలంగాణ రాష్ట్రం ఎటు పోతుందో చూడాలి.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.