Local Body Elections : ‘స్థానిక’ సమరానికి రేవంత్ సై ! మరి ప్రతిపక్షాల సన్నద్ధత ఎంత మేరకు
ప్రధానాంశాలు:
Local Body Elections : స్థానిక సమరానికి రేవంత్ సై, మరి ప్రతిపక్షాల సన్నద్ధత ఎంత మేరకు
Local Body Elections : తెలంగాణలో Telangana వరుస ఎన్నికల సమరానికి సీఎం రేవంత్ Revanth reddy రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. పథకాల అమలుకు ఈ నెల 26 ను ముహూర్తం తేదీగా ఇప్పటికే ప్రకటించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలతో ప్రారంభించి స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు వేగవంతం చేస్తుంది. ఎన్నికల ప్రక్రియలో దశల వారీగా పంచాయతీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీలు మరియు మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు ఉంటాయి. రాష్ట్ర సమగ్ర గృహ సర్వే నుండి డేటాను స్వీకరించిన తర్వాత అంకితమైన బీసీ కమిషన్ రిజర్వేషన్లను సిద్ధం చేస్తోంది. ఎన్నికల కమిషన్‌కు సమర్పించే ముందు ప్రభుత్వం కమిషన్ నివేదికను ఆమోదిస్తుంది. ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తుంది.జిల్లా అధికారులు ఇప్పటికే సన్నాహాలను ముమ్మరం చేశారు. గ్రామాల వారీగా ఓటర్ల జాబితాలు మరియు పోలింగ్ స్టేషన్ వివరాలను విడుదల చేశారు. అన్ని ప్రాంతాలలో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా చూసేందుకు, ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించడానికి నోడల్ అధికారులను నియమించారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు Local Body Elections ఈ సమయంలోనే వెళ్లాలని ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ఏఐసీసీ సైతం తాజాగా ఈ ఎన్నికల పైన దిశా నిర్దేశం చేసినట్లు సమాచారం. BRS బీఆర్ఎస్, BJP బీజేపీ లను దెబ్బకొట్టేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తుంది. సీఎం రేవంత్ విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత ఎన్నికల నిర్వహణ పైన నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
పథకాల అమలును ఆలంబనగా చేసుకుంటూ
ఈ నెల 26 నుంచి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలును ప్రారంభించనుంది. రైతు భరోసా తో పాటుగా కొత్త రేషన్ కార్డులను జారీ చేయనుంది. ఈ సమయంలోనే ఎన్నికల నిర్వహణ ద్వారా ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇటీవల జరిగిన టీపీసీసీ పీఏసీ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సైతం Local Body Elections స్థానిక సంస్థలకు ఎన్నికలు త్వరగా జరపాలంటూ దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి మూడు, నాలుగు వారాల్లో గ్రామ పంచాయతీలు Local Body Elections , జిల్లా పరిషత్తులకు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్దం అవుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
ఫిబ్రవరిలో పంచాయతీ మరియు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
పార్టీ నేతల సమాచారం మేరకు ఫిబ్రవరి మూడో వారంలో మూడు విడతలుగా గ్రామ పంచాయతీలకు, నాలుగో వారంలో MPTC ఎంపీటీసీ, ZPTC జడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు బీసీ రిజర్వేషన్ పెంపు అంశం అవరోదంగా మారింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ మేరకు కుల గణన జరుగుతోంది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఈ సర్వే నివేదికను ఆమోదించే అవకాశం ఉంది. బీసీల రిజర్వేషన్‌ను 42 శాతానికి పెంచుకునేలా అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరనున్నట్లు సమాచారం.