Revanth Reddy : రైతుల‌కి మ‌రో గుడ్ న్యూస్ చెప్పిన సర్కారు.. యూనిట్‌కి రూ.ల‌క్ష‌ల రూపాయ‌లు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Revanth Reddy : రైతుల‌కి మ‌రో గుడ్ న్యూస్ చెప్పిన సర్కారు.. యూనిట్‌కి రూ.ల‌క్ష‌ల రూపాయ‌లు..!

 Authored By ramu | The Telugu News | Updated on :17 January 2025,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Revanth Reddy : రైతుల‌కి మ‌రో గుడ్ న్యూస్ చెప్పిన సర్కారు.. యూనిట్‌కి రూ.ల‌క్ష‌ల రూపాయ‌లు..!

Revanth Reddy : తెలంగాణ ప్ర‌భుత్వం Telangana Govt రైతుల‌కి Farmar  వ‌రాల జ‌ల్లు కురిపిస్తుంది. తెలంగాణలో ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం Indiramma House Scheme కింద ఇండ్లు మంజూరు చేసేందుకు రేవంత్ సర్కార్ రెడీ అయింది. ఈనెల 26న ఈ పథకం ప్రారంభం కానుండగా.. అందుకు సంబంధించిన కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వం తొలివిడతలో ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మొత్తం 4.16 లక్షల ఇళ్లను మంజూరు చేయనుంది. ఇప్పుడు ష్ట్రంలో మరో స్కీం ప్రారంభించేందుకు సిద్ధమైంది. ‘ఇందిరమ్మ జలప్రభ స్కీమ్’లో భాగంగా గిరిజన రైతులకు రేవంత్ Revanth reddy  సర్కార్ 100 శాతం సబ్సిడీతో సోలార్ పంపుసెట్లు ఇవ్వ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది.

Revanth Reddy రైతుల‌కి మ‌రో గుడ్ న్యూస్ చెప్పిన సర్కారు యూనిట్‌కి రూల‌క్ష‌ల రూపాయ‌లు

Revanth Reddy : రైతుల‌కి మ‌రో గుడ్ న్యూస్ చెప్పిన సర్కారు.. యూనిట్‌కి రూ.ల‌క్ష‌ల రూపాయ‌లు..!

Revanth Reddy వరాల జ‌ల్లు..

ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద 4 ఎకరాల్లోపు భూములు సాగు చేస్తున్న 2.30 లక్షల మందికి బోరు వేసేందుకు, మోటార్‌కు అయ్యే ఖర్చును కూడా అందించనుంది. ఒక్కో రైతు యూనిట్ ఖర్చు రూ.6 లక్షలుగా నిర్ణయించింది. ఈ పథకం దశల వారీగా అమలు కానుండగా బడ్జెట్‌లో నిధులు కేటాయించనుంది. కేంద్రం నుంచి 40 శాతం నిధులు రానున్నాయి. అయితే ఈ ప‌థ‌కం గురించి గతంలోనే భ‌ట్టి విక్ర‌మార్క ఓ ప్ర‌క‌ట‌న చేశారు. మ‌రోవైపు బీఆర్‌ఎస్‌ Brs Party ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని ఐటీడీఏలకు నిధుల కొరత ఏర్పడిందని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఐటీడీఏలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్వ వైభవాన్ని తెస్తుందని చెప్పారు. ఐటీడీఏలను పునరుద్ధరిస్తామని.. గిరిజన రైతులకు సాగునీరు, సుస్థిర జీవనోపాధికి భరోసా కల్పిస్తామ‌ని ఆయ‌న అన్నారు.

గిరిజన రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం త్వరలో ఐజేపీ పథకాన్ని ప్రారంభిస్తామని కూడా భ‌ట్టి చెప్పారు. ఇక ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇసుకను సైతం ఉచితంగా సరఫరా చేయాలని సర్కార్ సూత్రప్రాయ అంగీకారానికి వచ్చినట్లు తెలిసింది. ఇందుకోసం ఆయా జిలాల్లో వాగులు, నదుల్లో రీచ్‌లను గుర్తించాల్సి ఉంది. సిమెంట్, స్టీల్‌ సరఫరాపైనా Revanth reddy రేవంత్ ప్రభుత్వం దృష్టిసారించింది. వీటిని పెద్దమొత్తంలో ఒకేసారి తీసుకుంటే తక్కువ ధరకు ఇవ్వడానికి ముందుకు వచ్చే సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరిపే అవకాశాలున్నాయి.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది