Uttam Kumar Reddy : బిగ్ బ్రేకింగ్.. కాంగ్రెస్‌కు భారీ షాక్.. బీఆర్ఎస్‌లోకి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. వెంటనే మంత్రి పదవి.. !
Uttam Kumar Reddy : ఇది ఎన్నికల కాలం. తెలంగాణలో ఇంకో ఐదారు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈనేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు వానాకాలం ప్రారంభం అయినా వేడెక్కుతున్నాయి. రోజురోజుకూ హీటు పెంచుతున్నాయి. అసలు తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నాయకులు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంప్ చేయడం సహజమే. ఇటీవల పొంగులేటి, జూపల్లి ఇద్దరూ కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి షాకిస్తూ బీఆర్ఎస్ లోకి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేరబోతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. ఉత్తమ్ కుమార్ రెడ్డి త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారని.. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఆయన భార్యకు కూడా ఎక్కడ అడిగితే అక్కడ టికెట్ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. తన అనుచరులతో కలిసి భారీగానే బీఆర్ఎస్ లో చేరేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
Uttam Kumar Reddy : ఉత్తమ్ ఓకే అంటే వెంటనే మంత్రి పదవి
ఉత్తమ్ కుమార్ రెడ్డితో నేరుగా సీఎం కేసీఆర్ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఉత్తమ్ ఓకే అంటే వెంటనే మంత్రి పదవి ఇచ్చి ఎన్నికల వరకు ఉత్తమ్ ను మంత్రిగా ఉంచే అవకాశం ఉంది. వెంటనే ప్రమాణ స్వీకారం కూడా జరగనుంది. నేరుగా కేసీఆర్ రంగంలోకి దిగి ఉత్తమ్ బీఆర్ఎస్ చేరిక వ్యవహారంపై ఇంత శ్రద్ధ పెడుతున్నారంటే తెలంగాణ రాజకీయాలు ఇంకా ఎన్ని మలుపులు తీసుకుంటాయో.
ఉత్తమ్ కు మంత్రి పదవితో పాటు రాబోయే ఎన్నికల్లో ఉత్తమ్, ఆయన భార్య ఇద్దరికీ ఎమ్మెల్యే టికెట్లు, తనతో పాటు బీఆర్ఎస్ లో చేరే మరో 10 మంది నేతలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేందుకు కూడా కేసీఆర్ అంగీకరించారట. ఉత్తమ్ ఏ ప్రతిపాదన చెబితే.. దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారట కేసీఆర్. అందుతూ తన అనుచరుతలో భారీగానే పార్టీలో చేరేందుకు ఉత్తమ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
నిజానికి.. ఉత్తమ్ కుమార్ రెడ్డి గత కొంత కాలంగా పార్టీలో అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి పీసీసీ ప్రెసిడెంట్ గా ఉత్తమ్ రాజీనామా చేసిన తర్వాత.. రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ లో సీనియర్లుగా నేతలకు, ఆయనకు పొసగడం లేదు. ఉత్తమ్, రేవంత్ కు కూడా పార్టీలో పడటం లేదు. నాలుగు దశాబ్దాల నుంచి పార్టీలో పనిచేస్తున్న తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రేవంత్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకొంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేతలు చాలా రోజుల నుంచి ఆరోపిస్తున్నారు.
ఈనేపథ్యంలో పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ లో చేరికపై కూడా తమతో చర్చించకుండానే, కనీసం చెప్పకుండానే రేవంత్ రెడ్డి వాళ్లను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుంటున్నారంటూ ఉత్తమ్ ఆగ్రహంతో ఉన్నారు. అలాగే.. బీఆర్ఎస్ నేత శశిధర్ రెడ్డిని కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని.. ఆయన కాంగ్రెస్ లోకి వస్తే.. కాంగ్రెస్ పార్టీ తరుపున శశిధర్ రెడ్డిని కోదాడలో పోటీ చేయించి.. తమను పక్కన పెట్టే ప్రయత్నాలు రేవంత్ రెడ్డి చేస్తున్నారని భావించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు.. బీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు సుముఖత చూపిస్తున్నట్టు తెలుస్తోంది.