revanthreddy
Revanth reddy : తెలంగాణ సీఎం కేసీఆర్ పై మరో సారి కాంగ్రెస్ నేత ఎంపీ రేవంత్ రెడ్డి విరుచుకు పడ్డాడు. ఇటీవలే కేసీఆర్ పార్లమెంట్ కు వెళ్లకుండానే హాజరు పట్టికలో వేరే వారితో సంతకం చేయించాడు అంటూ ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి మరో సారి కేసీఆర్ ను టార్గెట్ చేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మొదటి నుండి కూడా కేసీఆర్ మరియు బీజేపీ స్నేహితులే అంటూ ఆరోపిస్తున్న రేవంత్ రెడ్డి ఆ విషయాన్ని తేల్చాల్సిన సమయం వచ్చిందన్నాడు. ఈ సమయంలో కేసీఆర్ దేశంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల పక్షాన నిలుస్తారా లేదంటే ప్రధాని మోడీ పక్షాన నిలుస్తారా అనేది క్లారిటీ ఇవ్వాలంటూ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశాడు. మీరు ఎవరి పక్షం అంటూ రేవంత్ రెడ్డి వేసిన ప్రశ్నతో టీఆర్‌ఎస్ పార్టీ ఇరుకున పడ్డట్లయ్యింది.
రైతులకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ను ప్రశ్నించే స్థాయిలో ఉన్నాడా అంటూ ఎద్దేవ చేస్తూ టీఆర్‌ఎస్ నాయకులు ఫైర్ అవుతున్నారు. రేవంత్ రెడ్డి కి ఇప్పుడు రైతులు గుర్తు వచ్చారా అంటూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మరియు నాయకులు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ ఎవరి పక్షం అనేది అందరికి తెలుసని తెలంగాణ రాష్ట్రంలో రైతులకు కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు మరియు రైతు బంధు ఆయన్ను రైతు బాంధవుడిగా మార్చాయంటూ టీఆర్‌ఎస్ నాయకులు పేర్కొన్నారు.
revanthreddy
కేసీఆర్ ను ఎప్పటికప్పుడు ఇరుకున పెట్టేలా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు. ప్రతి సారి కూడా రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు అంతా కూడా కేసీఆర్ మరియు మోడీ మద్య రహస్య స్నేహం కొనసాగుతుందని గల్లీలో కొట్టుకుంటున్న టీఆర్‌ఎస్ బీజేపీలు ఢిల్లీలో మాత్రం దోస్త్ మేరా దోస్త్ అనుకుంటున్నారు అంటూ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజాగా రైతుల ఉద్యమంకు టీఆర్‌ఎస్ నాయకులు మద్దతు తెలపడం లేదని, మోడీ కి టీఆర్‌ఎస్ పార్టీ మద్దతు తెలుపుతుంది అంటూ రేవంత్ రెడ్డి అన్నారు.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.