Ismart Song : డ‌బుల్ ఇస్మార్ట్‌లో కేసీఆర్ ఫేమ‌స్ డైలాగ్ వాడిన పూరీ.. ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ నాయ‌కులు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ismart Song : డ‌బుల్ ఇస్మార్ట్‌లో కేసీఆర్ ఫేమ‌స్ డైలాగ్ వాడిన పూరీ.. ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ నాయ‌కులు

 Authored By ramu | The Telugu News | Updated on :18 July 2024,7:00 pm

Ismart Song : ఈ మ‌ధ్య కాలంలో హిట్టైన సినిమాల‌కి సీక్వెల్స్ వ‌స్తుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. అందులో కొన్ని విజ‌యం సాధిస్తే మరి కొన్ని ఫ్లాప్స్ అందుకున్నాయి. తొలిపార్టుతో ఊహించని రికార్డులు కొల్లగొట్టిన సినిమా.. సీక్వెల్‌తో బాక్సాఫీస్ దగ్గర ఊచకోతే అని ఎగ్‌జైట్‌మెంట్‌తో ఎదురు చూస్తుంటారు.ఇప్పుడు డ‌బుల్ ఇస్మార్ట్ శంక‌ర్ కోసం చాలా ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు.అప్పటివరకు లవర్‌ బాయ్‌ రోల్స్‌తో అదరగొట్టిన రామ్‌ పోతినేని.. తొలిసారి మాస్‌ క్యారెక్టర్‌లో ఇరగదీశాడు. ఈ సినిమాతో రామ్‌కు మాస్‌ ఆడియెన్స్‌లో విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. అంతేకాదు ఈ సినిమా తర్వాత రామ్ కథల ఎంపికలో కూడా చాలా చేంజేస్ వచ్చాయి.అదే క్రేజ్‌తో డబుల్ ఇస్మార్ట్‌ను స్టార్ట్ చేశారు. గతేడాది జులైలో సెట్స్ మీదకు వెళ్లిన డబుల్ ఇస్మార్ట్.. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్‌తో శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుంది.

Ismart Song గులాబీ బాస్ డైలాగ్‌తో..

ఓ వైపు లైగర్ తో భారీ దెబ్బ తిన్న పూరి.. ఈ సారి ఎలాగైనా మాస్ కంబ్యాక్ ఇవ్వాలని కసితో డబుల్ ఇస్మార్ట్ ను తెరకెక్కిస్తున్నాడు. పైగా సంజయ్ దత్ వంటి బాలీవుడ్ స్టార్ ను రంగంలోకి దింపడంతో ఈ సినిమాపై ఆడియెన్స్ లో అంచనాలు ఒక్కసారిగా ఎగబాకాయి.డ‌బుల్ ఇస్మార్ట్ సోలోగా పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ కాబోతుంది. ఇక ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు.. ఆడియెన్స్‌లో మాములు అంచనాలు క్రియేట్ చేయలేదు. మరీ ముఖ్యంగా ఈ సారి పూరీ మాస్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో అని సినీ లవర్స్ ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నారు. తాజాగా చిత్రం నుండి ఓ సాంగ్ విడుద‌లైంది. కల్లు దుకాణం వద్ద ఉండే ఓ పాట మధ్యలో దర్శకుడు పూరీ జగన్నాధ్ ‘అయితే ఏం చేద్దామంటవ్ మరి’ అని మీడియా సమావేశాలలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనే మాటను ముందు పెట్టడం తీవ్ర దుమారం రేపుతుంది.

Ismart Song డ‌బుల్ ఇస్మార్ట్‌లో కేసీఆర్ ఫేమ‌స్ డైలాగ్ వాడిన పూరీ ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ నాయ‌కులు

Ismart Song : డ‌బుల్ ఇస్మార్ట్‌లో కేసీఆర్ ఫేమ‌స్ డైలాగ్ వాడిన పూరీ.. ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ నాయ‌కులు

కల్లు దుకాణం వద్ద చిత్రీకరించే పాటకు కేసీఆర్ వాయిస్ తీసుకోవడం తీవ్రంగా అవమానించడమేనని విమర్శలు మొదలయ్యాయి. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న డబల్ ఇస్మార్ట్ సినిమాకు పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తుండగా చార్మి కౌర్ నిర్మిస్తున్నది. మణిశర్మ సంగీతం అందించగా రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ పాటను కాసర్ల శ్యాం రాశారు. అయితే ఒక పాట విడుదల చేస్తున్నప్పుడు ఆ సినిమా దర్శకుడి మీదనే అన్ని బాధ్యతలు ఉంటాయి. సినిమా అనేది సమాజం మీద ప్రభావం చూయించే రంగాలలో ప్రధానమయింది. ఒక మాజీ ముఖ్యమంత్రి వాయిస్ ను తీసుకుంటున్నప్పుడు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే సున్నితమైన అంశాలు అనవసర వివాదాలకు దారి తీసే అవకాశం ఉంది. మ‌రి దీనిపై చిత్ర బృందం ఇప్ప‌టి వ‌ర‌కైతే స్పందించ‌లేదు కాని ఏదో ఒక క్లారిటీ అయితే వ‌స్తుంద‌ని ముచ్చ‌టించుకుంటున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది