Congress : ఆ ముగ్గురు నేతలు క్లారిటీ ఇచ్చారు.. హస్తం గూటికి కన్ఫమ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Congress : ఆ ముగ్గురు నేతలు క్లారిటీ ఇచ్చారు.. హస్తం గూటికి కన్ఫమ్

 Authored By kranthi | The Telugu News | Updated on :5 November 2023,6:00 pm

ప్రధానాంశాలు:

  •  చేవెళ్ల ఎంపీ సీటు కొండాకు కన్ఫమ్?

  •  డీకే ఆరుణకు కూడా ఎంపీ టికెట్ ఇస్తారా?

  •  విజయశాంతికి ఎంపీ టికెట్ ఇస్తామని పిలుపు

Congress : ప్రస్తుతం తెలంగాణలో పార్టీల మార్పు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి నేతలు మారుతున్నారు. ఇంకా ఎన్నికలకు 25 రోజుల సమయమే ఉన్నా పార్టీలు మారే నాయకుల సంఖ్య మాత్రం రోజురోజుకూ పెరుగుతోంది. అయితే.. ఇక్కడ వార్ వన్ సైడ్ అన్నట్టుగా గత కొన్ని రోజుల నుంచి బీఆర్ఎస్, బీజేపీల నుంచి కాంగ్రెస్ లోకే నేతలు చేరుతున్నారు. దీంతో కాంగ్రెస్ బలం రోజురోజుకూ పెరుగుతూ పోతోంది. బీఆర్ఎస్ నుంచి కీలక నేతలు కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. అలాగే.. బీజేపీ నుంచి కూడా కీలక నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. అన్ని పార్టీలకు ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ మాత్రమే కనిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి మాత్రమే కాదు.. బీజేపీ నుంచి కూడా భారీగా నేతలు కాంగ్రెస్ కు క్యూ కడుతున్నారు. బీజేపీలో కీలక నేతలుగా ఉన్న డీకే అరుణ, విజయశాంతి, కొండ విశ్వేశ్వర్ రెడ్డి గత కొన్ని రోజులుగా పార్టీలో యాక్టివ్ గా లేరు. సైలెంట్ గా ఉన్నారు. ఈనేపథ్యంలో పార్టీ నుంచి బయటికి వచ్చేందుకు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి, వివేక్ బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. దీంతో ఇక ఈ ముగ్గురు కూడా త్వరలోనే బీజేపీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వచ్చాయి.

బీజేపీలో సైలెంట్ గా ఉన్నప్పటికీ విజయశాంతికి ఉన్న స్టాటస్ వేరు. కానీ.. తనకు ఈసారి అసెంబ్లీ సీటు దక్కలేదు. దీంతో బీజేపీలో తను చాలా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకున్నా కనీసం ఎంపీ టికెట్ అయినా దక్కుతుందా అంటే డౌటే. అందుకే.. బీజేపీలో తగిన ప్రాధాన్యత లేదని గమనించిన విజయశాంతి కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. తనకు కాంగ్రెస్ నుంచి పిలుపు కూడా వచ్చిందట. లోక్ సభ ఎంపీ సీటు కూడా ఇచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. దీంతో విజయశాంతి బీజేపీకి బైబై చెప్పి త్వరలోనే కాంగ్రెస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో డీకే అరుణకు ఉన్న పాపులారిటీ వేరు. తను కాంగ్రెస్ హయాంలో మంత్రిగానూ పని చేశారు. కానీ.. తాను బీజేపీలో చేరారు. అప్పటి నుంచి తనకు పార్టీలో అంతగా ప్రాధాన్యత దక్కడం లేదని భావిస్తున్నారు. బీజేపీలో తను అంతగా యాక్టివ్ గా లేరు. కాంగ్రెస్ లో చేరేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.

Congress : చేవెళ్ల ఎంపీ టికెట్ ఆశిస్తున్న కొండా

కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారట. ఆయనకు చేవెళ్ల ఎంపీ సీటు కావాలని ముందే అడిగారట. దీంతో ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో కొండా ఎప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటారు అనేదానిపై క్లారిటీ లేదు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది