#image_title
DK Shiva Kumar : తెలంగాణలో ఇది ఎన్నికల సమయం. ఇంకో రెండు మూడు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈనేపథ్యంలో తెలంగాణలో ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. ఎలాగైనా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించి తమ సత్తా చాటాలని అధికార బీఆర్ఎస్ భావిస్తుంటే.. ఒక్క చాన్స్ కోసం కాంగ్రెస్, బీజేపీలు ఎదురు చూస్తున్నాయి. అయితే.. ప్రస్తుతం తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కంటే కూడా కాంగ్రెస్ పార్టీ వైపే గాలులు వీస్తున్నాయి. దానికి కారణం.. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు. కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలవడంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి. తెలంగాణలోనూ పార్టీ రోజురోజుకూ బలపడుతోంది. ఇదే బలంతో ఎన్నికల్లోకి వెళ్లి గెలవాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. అందుకే వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో దూసుకుపోతోంది.
కాంగ్రెస్ హైకమాండ్ కూడా తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ క్యాడర్ లోనూ నూతన ఉత్సాహం వచ్చింది. మరోవైపు కర్ణాటక డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ డీకే శివ కుమార్ కూడా తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడానికి తనదైన వ్యూహాలు రచిస్తున్నారు. తెలంగాణ నేతలు కూడా పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో ఉన్న ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఇప్పటికే చాలామంది నేతలు కాంగ్రెస్ లో చేరడంతో కాంగ్రెస్ బలం అమాంతం పెరిగింది. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరే నేతలకు డీకే శివ కుమార్ మద్దతు ఇస్తున్నారు. వాళ్లకు ఎలాంటి డౌట్స్ ఉన్నా బెంగళూరుకు పిలిపించుకొని మరీ క్లియర్ చేస్తున్నారు డీకే శివకుమార్. కాంగ్రెస్ లో చేరాలనుకునే వాళ్లు కూడా నేరుగా డీకే శివకుమార్ తోనే భేటీ అవుతున్నారు.
#image_title
తెలంగాణకు చెందిన ఇతర పార్టీ నేతలు ఢిల్లీ దాకా వెళ్లడం లేదు. కాంగ్రెస్ పెద్దలను కలవడం లేదు. తాము కాంగ్రెస్ లో చేరాలనుకుంటే.. వెళ్లి డీకేతో భేటీ అవుతున్నారు. ఆయన దగ్గర్నుంచే తమకు టికెట్ కన్ఫమ్ అవుతోంది. అందుకే ఇప్పటి వరకు కాంగ్రెస్ లో చేరిన చాలామంది నేతలు డీకేతో భేటీ అయినవాళ్లే. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో డీకే పాత్ర ఎనలేనిది. ఆయనకు అధిష్ఠానం కూడా చాలా పవర్స్ ఇచ్చేసింది. ఆయనకు నేరుగా అధిష్ఠానంతో సంబంధాలు ఉన్నాయి. దీంతో దక్షిణాది రాష్ట్రాలను ఆయనే దగ్గరుండి చూసుకుంటున్నారు. తెలంగాణలో గెలుపు కోసం కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడి నేతలు బెంగళూరుకు క్యూ కడుతున్నారు. డీకేకు ఉన్న క్రేజ్ వల్ల గతంలో రేవంత్ రెడ్డి కూడా ఆయన్ను కలిశారు. కాంగ్రెస్ నేతలే కాదు.. ఇటీవల వైఎస్ షర్మిల కూడా డీకేను కలిశారు. శివకుమార్ ను షర్మిల కలిసినప్పటి నుంచి వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నారన్న టాక్ నడిచింది. తుమ్మల ఇటీవల కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. ఆయన కూడా డీకేను కలిసిన తర్వాతే పార్టీలో చేరారు. మోత్కుపల్లి నర్సింహులు కూడా డీకేను కలిశారట. అంటే.. ఆయన కూడా కాంగ్రెస్ జెండా కప్పుకోబోతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణపై డీకే బిగ్ స్కెచ్ వేసినట్టే తెలుస్తోంది. రేవంత్, డీకే కలిసి ఇప్పటికే గెలుపు వ్యూహాలను రచిస్తున్నారు.
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్‌లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Nepal Crisis Deepens : నేపాల్‌లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
This website uses cookies.