Etela Rajender : కేసీఆర్ ను కాపాడాల్సిన అవసరం నాకు లేదు – ఈటెల..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 8 June 2025, 1:10 pm
  •  Etela Rajender : కేసీఆర్ ను కాపాడాల్సిన అవసరం నాకు లేదు - ఈటెల..!

Etela Rajender : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జరుగుతున్న కమిషన్ విచారణలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఈటల, తాను కమిషన్ ఎదుట హాజరై విచారణకు సమాధానాలు ఇచ్చినట్టు తెలిపారు. తన ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలను స్పష్టంగా వివరించానని చెప్పారు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఆర్థిక నిర్ణయాలు పూర్తిగా మంత్రివర్గ సమావేశాల ద్వారా జరిగాయని స్పష్టం చేశారు. “కేసీఆర్‌ను నేను రక్షించాల్సిన అవసరం లేదు,” అని ఆయన తేల్చి చెప్పారు.

Etela Rajender : కేసీఆర్ ను కాపాడాల్సిన అవసరం నాకు లేదు - ఈటెల..!

Etela Rajender : కేసీఆర్ ను కాపాడాల్సిన అవసరం నాకు లేదు – ఈటెల..!

etela rajender : కాళేశ్వరం ప్రాజెక్ట్‌ అవకతవకలపై ఈటెల ఏమన్నారంటే..!!

ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలపై ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. తప్పుడు వ్యాఖ్యలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ మంత్రులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేక దశలలో మంత్రివర్గ ఉపసంఘం (కేబినెట్ సబ్ కమిటీ) సిఫార్సుల ఆధారంగా ముందుకెళ్లిందని వివరించారు. ప్రాజెక్ట్‌లో జరిగిన రీడిజైనింగ్, వాటి వెనుకనున్న నిర్ణయాలను త్వరలోనే అన్ని జీవోలు (G.O.s), సబ్ కమిటీ నివేదికల రూపంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఇది అసలు నిజాలు వెలుగులోకి వచ్చే దశగా అభివర్ణించారు.

అలాగే కేబినెట్లో చర్చించకుండా ఏ ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదని ఈటల స్పష్టం చేశారు. అప్పటి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, కడియం శ్రీహరి వంటి వారంతా ఈ ప్రక్రియకు సాక్షులేనని గుర్తు చేశారు. ప్రతి ఒక్క నిర్ణయంపై కేసీఆర్ మంత్రులతో సంపూర్ణ చర్చ చేసిన తరువాతే అమలు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ నేతలు నిజంగా ధైర్యం ఉంటే, అప్పటి పీసీ ఘోష్ కమిటీ నివేదికను ప్రజల ముందు ఉంచాలని, లేదంటే కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి