Uppal Congress : ఉప్పల్‌లో కాంగ్రెస్‌కు భారీ ఊపు.. రేవంత్ అభివృద్ధి క్తి పెరుగుతున్న మద్దతు : మందుముల

 Authored By ramu | The Telugu News | Updated on :6 July 2026,5:30 pm

ప్రధానాంశాలు:

  •  Uppal Congress : ఉప్పల్‌లో కాంగ్రెస్‌కు భారీ ఊపు.. రేవంత్ అభివృద్ధి క్తి పెరుగుతున్న మద్దతు : మందుముల

Uppal Congress : తెలంగాణలో రాజకీయ వాతావరణం రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రభావంతో పలువురు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మందుముల పరమేశ్వర్ రెడ్డి అన్నారు. ఉప్పల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, యువత, మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరగా, వారికి పార్టీ కండువా కప్పి ఆయన ఘనంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా మాట్లాడిన మందుముల పరమేశ్వర్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో అభివృద్ధి కొత్త దిశగా సాగుతోందని పేర్కొన్నారు. ప్రజా పాలనలో పార్టీలకు అతీతంగా ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, అదే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణకు కారణమని తెలిపారు.

Uppal Congress : ఉప్పల్‌లో కాంగ్రెస్‌కు భారీ ఊపు.. రేవంత్ అభివృద్ధి క్తి పెరుగుతున్న మద్దతు : మందుముల

Uppal Congress : ఉప్పల్‌లో కాంగ్రెస్‌కు భారీ ఊపు.. రేవంత్ అభివృద్ధి క్తి పెరుగుతున్న మద్దతు : మందుముల

Uppal Congress అభివృద్ధే కాంగ్రెస్ బలం.. ప్రతిపక్షాల నుంచి కూడా ప్రశంసలు

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు కూడా సీఎం రేవంత్ రెడ్డి పనితీరును అభినందిస్తున్నారని మందుముల వ్యాఖ్యానించారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అదే కారణంగా ప్రజలతో పాటు వివిధ పార్టీల నాయకులు కూడా కాంగ్రెస్‌పై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు సమర్థంగా అమలు కాలేదని విమర్శించిన ఆయన, ప్రస్తుతం మాత్రం ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూరే విధంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

Uppal Congress బీరప్పగడ్డలో కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు

బీరప్పగడ్డ డివిజన్ అధ్యక్షుడు ఆకిటి ఆగం రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయురాలు కొల్లూరి ఉషారాణి, గవ్వల సంతోష్ కుమార్తో పాటు చత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్‌కు చెందిన పలువురు యువకులు, మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.పార్టీలో చేరిన వారందరికీ మందుముల పరమేశ్వర్ రెడ్డి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ప్రజా సేవే కాంగ్రెస్ లక్ష్యమని, అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరికీ పార్టీలో స్థానం ఉంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

Uppal Congress చెరువుల అభివృద్ధిపై బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు

ఉప్పల్ నియోజకవర్గంలోని చెరువుల అభివృద్ధి అంశాన్ని ప్రస్తావించిన మందుముల పరమేశ్వర్ రెడ్డి, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని ప్రచారం చేసుకుందని, కానీ క్షేత్రస్థాయిలో పనులు జరగలేదని ఆరోపించారు.చెరువుల పునరుద్ధరణ పేరుతో భారీ ప్రకటనలు చేసినప్పటికీ, వాస్తవానికి అభివృద్ధి కనిపించలేదని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చెరువుల అభివృద్ధి, సుందరీకరణ కోసం రూ.150 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసి పనులను వేగంగా పూర్తి చేస్తోందని చెప్పారు.ప్రస్తుతం ఉప్పల్, కాప్రా పరిధిలోని చెరువుల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రజలకు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

ప్రజా పాలనలో అభివృద్ధి.. కాంగ్రెస్‌లోకి పెరుగుతున్న చేరికలు

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల అభివృద్ధి, చెరువుల పునరుద్ధరణ, ప్రజా సమస్యల పరిష్కారంలో చూపుతున్న చొరవ వల్ల కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీరప్పగడ్డ, చిలకనగర్, హబ్సిగూడ, ఉప్పల్ డివిజన్లకు చెందిన కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు, యువజన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ అభివృద్ధిని ప్రతి ఇంటికీ చేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని మందుముల పరమేశ్వర్ రెడ్డి తెలిపారు.

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి