KTR : తెలంగాణాలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బిఆర్ఎస్ తుఫాన్ వేగంతో విజయం సాధిస్తుంది : కేటీఆర్
ప్రధానాంశాలు:
KTR : తెలంగాణాలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బిఆర్ఎస్ తుఫాన్ వేగంతో విజయం సాధిస్తుంది : కేటీఆర్
KTR : తెలంగాణలో Telangana ప్రస్తుతం రాజకీయం వేడి పెరుగుతున్న వేళ, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజల్లో కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తి నెలకొంది. “రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రజలు బీఆర్ఎస్‌ను గెలిపిస్తారు..బిఆర్ఎస్ కు ఓటు వేసేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారు” అని కేటీఆర్ పేర్కొన్నారు.

KTR : తెలంగాణాలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బిఆర్ఎస్ తుఫాన్ వేగంతో విజయం సాధిస్తుంది : కేటీఆర్
KTR రాష్ట్రంలో ఎవర్ని అడిగిన బిఆర్ఎస్ కే ఓటు వేస్తాం అని చెపుతారు – కేటీఆర్
కులం, మతం, ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పాలనపై ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని, కేటీఆర్ ఆయనకు ఘన నివాళులర్పించారు. బాబాసాహెబ్ సమసమాజం కోసం పోరాడిన యోధుడని కొనియాడారు. దళిత బహుజన వర్గాలకు ఆయన ఆశాజ్యోతిగా నిలిచారని కేటీఆర్ చెప్పారు. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 వలననే తెలంగాణ రాష్ట్రంగా అవతరించగలిగిందని తెలిపారు.
ఇక కేటీఆర్ వ్యాఖ్యల ద్వారా బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికలపై పూర్తి నమ్మకంతో ఉందని స్పష్టమవుతోంది. ప్రజల్లో కాంగ్రెస్ పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని, పార్టీ మరింత బలంగా ముందుకు సాగేందుకు సిద్ధమవుతున్నదని ఈ ప్రసంగం ద్వారా తెలుస్తోంది. బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణకు ఇది మరింత ఊతమిచ్చే అవకాశం ఉంది.