Women : మహిళలకి తీపి కబురు.. దసరాకి ప్రత్యేక కానుక..!
ప్రధానాంశాలు:
Women : మహిళలకి తీపి కబురు.. దసరాకి ప్రత్యేక కానుక..!
Women : తెలంగాణలోని మహిళలకు శుభవార్త. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలకు ఈ దసరాకి ప్రభుత్వం ప్రత్యేకంగా ఉచిత చీరల పంపిణీ చేయనున్నది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన చీరల తయారీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.గతంలో అమలు చేసిన బతుకమ్మ చీరల పథకాన్ని రద్దు చేసిన అనంతరం, ఇప్పుడు ప్రతి SHG మహిళకు ఏటా రెండు చీరలు ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 318 కోట్లు కేటాయించింది. ఏప్రిల్ 2025లో చీరల తయారీ ప్రారంభమైంది.

Women : మహిళలకి తీపి కబురు.. దసరాకి ప్రత్యేక కానుక..!
Women : శుభవార్త..
ఇప్పటివరకు 25 లక్షల చీరల తయారీ దాదాపు పూర్తయింది. మరో 40 లక్షల చీరల తయారీ ప్రస్తుతానికి పురోగతిలో ఉంది. మొత్తం 4.5 కోట్ల మీటర్లతో 65 లక్షల చీరలు తయారుచేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.ఈ మొత్తం ప్రక్రియను 6 నెలల లోపు పూర్తి చేయాలని చేనేత, జౌళి శాఖ కసరత్తు చేస్తోంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 131 సహకార సంఘాలు, 56 చిన్నతరహా పరిశ్రమలు పాల్గొంటున్నాయి. ప్రధానంగా సిరిసిల్లతో పాటు కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని కార్మికులకు ఆర్డర్లు అందాయి.
దాదాపు 10 వేల మంది కార్మికులు ఈ పథకం ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఒక్కో కార్మికుడికి నెలకు రూ. 25,000 వరకు వేతనం లభిస్తోంది. కార్మికులకు రెగ్యులర్‌గా చెల్లింపులు జరుపుతున్నారు. డిజైన్లను నిపుణుల సహాయంతో రూపొందించగా, వాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీపడకుండా చేనేత శాఖ కమిషనర్ శైలజారామయ్యర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల మహిళలు – 48 లక్షలు,పట్టణ ప్రాంతాల మహిళలు – 17 లక్షలు,
మొత్తం 65 లక్షల SHG మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు.