
Gandra Venkataramana Reddy : గండ్ర వెంకటరమణ రెడ్డినే నా భర్తని చంపించాడు : రాజలింగమూర్తి భార్య
Gandra Venkataramana Reddy : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ Medigadda బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్ BRS ప్రభుత్వమే కారణమని కేసు వేసిన భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి(47) Rajalingamurthy దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను నరికి చంపారు. బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజలింగమూర్తి వార్డు మాజీ కౌన్సిలర్ అయిన నాగవెళ్లి సరళ భర్త. ఆమె 2019లో జరిగిన పురపాలక ఎన్నికల్లో భూపాలపల్లి లోని 15వ వార్డు నుంచి బీఆర్ఎస్ తరఫున కౌన్సిలర్‌గా గెలుపొందారు.
కొద్ది నెలల తర్వాత నాగవెళ్లి సరళను బీఆర్ఎస్ పార్టీ BRS Party నుంచి బహిష్కరించారు. ఈ నెల 19వ తేదీన రాజలింగమూర్తి తన స్వగ్రామం జంగేడు శివారు పక్కీరుగడ్డలో సోదరుల ఇంట్లో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లి బైక్పై భూపాలపల్లికి తిరిగి వస్తున్నాడు. సరిగ్గా తెలంగాణ Telangana బొగ్గు గని కార్మిక సంఘం ఎదురుగా రోడ్డును దాటుతున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ను చుట్టుముట్టి కత్తులు, గొడ్డళ్లతో విచక్షణా రహితంగా దాడి చేసి చంపేశారు.
Gandra Venkataramana Reddy : గండ్ర వెంకటరమణ రెడ్డినే నా భర్తని చంపించాడు : రాజలింగమూర్తి భార్య
తన భర్త దారుణహత్యకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి Gandra Venkataramana Reddy, మాజీ సర్పంచ్ బుర్ర చంద్రయ్య, వార్డు మాజీ కౌన్సిలర్ కొత్త హరిబాబు కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని రాజలింగమూర్తి భార్య సరళ, కుటుంబ సభ్యులతో కలిసి పట్టణంలోని అంబేడ్కర్ కూడలిలో నేషనల్ హైవేపై బుధవారం రాత్రి బైఠాయించారు. కాళేశ్వరం, మేడిగడ్డ అక్రమాలపై తన భర్త కేసు వేసినందుకే చంపించారని, నిందితులను కఠినంగా శిక్షించాలని సరళతో పాటు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు డిమాండ్ చేశారు. అలాగే రాజలింగమూర్తి హత్యకు గల కారణాలపై నిఘావర్గాల నుంచి సీఎంవో సమాచారం కోరింది. మేడిగడ్డ కుంగుబాటుపై కేసు వేసిన వ్యక్తి హత్యపై ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) ఆరా తీసింది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.