Gandra Venkataramana Reddy : గండ్ర వెంకటరమణ రెడ్డినే నా భర్తని చంపించాడు : రాజలింగమూర్తి భార్య | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Gandra Venkataramana Reddy : గండ్ర వెంకటరమణ రెడ్డినే నా భర్తని చంపించాడు : రాజలింగమూర్తి భార్య

 Authored By prabhas | The Telugu News | Updated on :20 February 2025,1:20 pm

ప్రధానాంశాలు:

  •  Gandra Venkataramana Reddy : గండ్ర వెంకటరమణ రెడ్డినే నా భర్తని చంపించాడు : రాజలింగమూర్తి భార్య

Gandra Venkataramana Reddy : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ Medigadda బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్ BRS ​ ప్రభుత్వమే కారణమని కేసు వేసిన భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి(47) Rajalingamurthy దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను నరికి చంపారు. బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజలింగమూర్తి వార్డు మాజీ కౌన్సిలర్​ అయిన నాగవెళ్లి సరళ భర్త. ఆమె 2019లో జరిగిన పురపాలక ఎన్నికల్లో భూపాలపల్లి లోని 15వ వార్డు నుంచి బీఆర్ఎస్​ తరఫున కౌన్సిలర్‌గా గెలుపొందారు.

కొద్ది నెలల తర్వాత నాగవెళ్లి సరళను బీఆర్ఎస్​ పార్టీ BRS Party నుంచి బహిష్కరించారు. ఈ నెల 19వ తేదీన రాజలింగమూర్తి తన స్వగ్రామం జంగేడు శివారు పక్కీరుగడ్డలో సోదరుల ఇంట్లో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లి బైక్​పై భూపాలపల్లికి తిరిగి వస్తున్నాడు. సరిగ్గా తెలంగాణ Telangana బొగ్గు గని కార్మిక సంఘం ఎదురుగా రోడ్డును దాటుతున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ను చుట్టుముట్టి కత్తులు, గొడ్డళ్లతో విచక్షణా రహితంగా దాడి చేసి చంపేశారు.

Gandra Venkataramana Reddy గండ్ర వెంకటరమణ రెడ్డినే నా భర్తని చంపించాడు రాజలింగమూర్తి భార్య

Gandra Venkataramana Reddy : గండ్ర వెంకటరమణ రెడ్డినే నా భర్తని చంపించాడు : రాజలింగమూర్తి భార్య

నా భ‌ర్త‌ను హ‌త్య చేయించింది గండ్ర వెంకటరమణ రెడ్డినే

తన భర్త దారుణహత్యకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి Gandra Venkataramana Reddy, మాజీ సర్పంచ్​ బుర్ర చంద్రయ్య, వార్డు మాజీ కౌన్సిలర్‌ కొత్త హరిబాబు కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని రాజలింగమూర్తి భార్య సరళ, కుటుంబ సభ్యులతో కలిసి పట్టణంలోని అంబేడ్కర్‌ కూడలిలో నేషనల్​ హైవేపై బుధవారం రాత్రి బైఠాయించారు. కాళేశ్వరం, మేడిగడ్డ అక్రమాలపై త‌న‌ భర్త కేసు వేసినందుకే చంపించారని, నిందితులను కఠినంగా శిక్షించాలని స‌ర‌ళ‌తో పాటు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు డిమాండ్‌ చేశారు. అలాగే రాజలింగమూర్తి హత్యకు గల కారణాలపై నిఘావర్గాల నుంచి సీఎంవో సమాచారం కోరింది. మేడిగడ్డ కుంగుబాటుపై కేసు వేసిన వ్యక్తి హత్యపై ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) ఆరా తీసింది.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది