Bolagani Jayaramulu : తాటిచెట్టుపై నుండి పడి గీత కార్మికుడు మృతి.. కానా సంస్థ ద్వారా ఆర్థిక సహకారం : బోలగాని జయరాములు
ప్రధానాంశాలు:
Bolagani Jayaramulu : తాటిచెట్టుపై నుండి పడి గీత కార్మికుడు మృతి.. కానా సంస్థ ద్వారా ఆర్థిక సహకారం : బోలగాని జయరాములు
Bolagani Jayaramulu : కల్లుగీత వృత్తి చేస్తూ ప్రమాదవశాత్తు జారిపడి చనిపోయిన దూడల ఆంజనేయులు గౌడ్ కుటుంబానికి ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్న కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా( కానా )వారి సేవలు ప్రశంసనీయమని KGKS రాష్ట్ర ఉపాధ్యక్షులు కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోలగాని జయరాములు అన్నారు .యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం శారాజిపేట గ్రామానికి చెందిన గీత కార్మికుడు దూడల ఆంజనేయులు గౌడ్ ఇటీవల ప్రమాదవశాత్తు వృత్తి చేస్తూ తాటి చెట్టు పై నుండి జారి కింద పడి చనిపోయినాడు. మృతుని కుటుంబం నిరుపేద కుటుంబమని భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారని వారి పోషణకు ఇబ్బంది అవుతుందని వారికి ఉపాధి అవకాశాలు కల్పించుటకు ఆర్థిక సహాయ సహకారాలు అందజేయాలని కల్లుగీత కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ విజ్ఞప్తి మేరకు కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వారు.

Bolagani Jayaramulu : తాటిచెట్టుపై నుండి పడి గీత కార్మికుడు మృతి.. కానా సంస్థ ద్వారా ఆర్థిక సహకారం : బోలగాని జయరాములు
Bolagani Jayaramulu కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా సేవలు ప్రశంసనీయం : బోలగాని జయరాములు
వారి భార్య దూడల లావణ్య కు 20వేల రూపాయల విలువగల కుట్టుమిషన్ ను,మరియు 10 వేల రూపాయల విలువ గల బ్లౌజ్ , స్కర్ట్ వస్త్రాల మెటీరియల్ ను కల్లుగీత కార్మిక సంఘం ద్వారా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోలగాని జయరాములు , రాష్ట్ర కమిటీ సభ్యులు దూపటి వెంకటేష్ లు శారాజిపేట గౌడ సంఘం అధ్యక్షులు దూడల లక్ష్మణ్ గౌడ్ ఆలేరు మాజీ వైస్ ఎంపీపీ బెంజరపు రవి గౌడ్. ఇతర నాయకులతో కలిసి అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా బోలగాని జయరాములు మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వారు గీతా కార్మిక కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా, ఆర్థిక సహాయ సహకారాలు చేయడం చాలా గొప్ప విషయం అని అన్నారు. అలాగే గీతా కార్మికులు తమ వృత్తిని జాగ్రత్తతో, నేర్పుగా చేసి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి.
అలాగే ప్రభుత్వం అందజేసే వృత్తి రక్షణ కిట్టులు గీత కార్మికులందరికీ సేఫ్టీ మోకులను అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్య క్రమంలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు దూపటి వెంకటేష్ , ఆలేరు మాజీ ఎంపీపీ బెంజరం రవి, సంఘం జిల్లా నాయకులు గుల్లపల్లి వెంకటేష్, శారాజిపేట కల్లుగీత సంఘం అధ్యక్షుడు దూడల లక్ష్మణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి దూడల వీరస్వామి, సంఘం మాజీ అధ్యక్షులు దూడల సిద్ధయ్య, దూడల బిక్షపతి,ప్రజా సంఘాల నాయకులు కేమెడీ ఉప్పలయ్య, సంఘం నాయకులు దూడల చంద్రమౌళి దూడల నరసయ్య తదితరులు పాల్గొన్నారు