Rythu Bandhu : రైతన్నలకు శుభవార్త…రైతుబంధు నిధులు విడుదల… చెక్ చేసుకోండి ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rythu Bandhu : రైతన్నలకు శుభవార్త…రైతుబంధు నిధులు విడుదల… చెక్ చేసుకోండి !

 Authored By ramu | The Telugu News | Updated on :26 March 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Rythu Bandhu : రైతన్నలకు శుభవార్త...రైతుబంధు నిధులు విడుదల...!

Rythu Bandhu : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి ఇచ్చిన 6 హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ వస్తుంది. ఇక ఈ 6 హామీలలో ఇప్పటికే 5 హామీలను పూర్తి చేసినట్లుగా వారు తెలియజేస్తున్నారు. ఇక వీటిలో మహాలక్ష్మి యోజన పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అలాగే 500 కి గ్యాస్ సిలిండర్ ,అదేవిధంగా గృహ జ్యోతి యోజన కింద ప్రతి ఇంట్లో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ,ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు ప్రారంభించనున్నారు. అదేవిధంగా ఇంటి స్థలం కలిగి ఉండి ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయం కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా బీమా సౌకర్యం ఆరోగ్య శ్రీ యోజన కింద 10 లక్షలు ఇస్తున్నారు.

అయితే గత ప్రభుత్వం రైతన్నలకు రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు 10,000 రూపాయలను ఏడాదికి రెండు విడతల్లో ఖాతాలలో జమ చేసేది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత ఇది కాస్త ఆలస్యమైందని చెప్పాలి.ఈ క్రమంలోనే గతంలో ఎకరం లోపు వ్యవసాయ భూమి కలిగి ఉన్న రైతులు ఖాతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు జమ చేయడం జరిగింది. అదేవిధంగా మొన్నటి వరకు మూడు ఎకరాలు కలిగి ఉన్న రైతులకు కూడా రైతుబంధు ఇచ్చేశారు. అయితే 3 నుంచి 5 ఎకరాల లోపు భూమి కలిగిన రైతులకు రైతు బంధు డబ్బులు ఇంకా చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి.దీంతో రైతన్నలు మాకు డబ్బు జమ చేయాల్సిందిగా అధికారులకు మొరపెట్టుకున్నారు.

ఎట్టకేలకు వారి నిరీక్షణ ముగిసింది అని చెప్పాలి. ఎందుకంటే తాజాగా 3 నుంచి 4 ఎకరాలు కలిగి ఉన్న రైతుల ఖాతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మధ్యాహ్నం నుంచి డబ్బులు జమ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో పలువురు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశాలలో రాష్ట్రంలో 93 శాతానికి పైగా రైతులకు కచ్చితంగా రైతుబంధు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం విడతల వారీగా రైతు సోదరులకు నగదు విడుదల చేస్తూవస్తుంది. అయితే మరికొన్ని రోజుల్లో లోక్ సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల నియమావళి విడుదలయితే కొత్త ప్రాజెక్ట్ లను ప్రారంభించడం కష్టమే కానీ ఉన్న ప్రాజెక్టులు మాత్రం కచ్చితంగా అమలు చేస్తారని తెలుస్తోంది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది