Mustard : చిట్టి ఆవాలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.. తెలిస్తే అస్సలు వదలరు..!
Mustard : ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఆస్తులున్న వాడు కాదు.. ఆరోగ్యం ఉన్న వాడే అదృష్టవంతుడు అని డాక్టర్లు చెబుతున్నారు. కోట్ల రూపాయలున్నా.. ఆరోగ్యంగా లేకుండా ఆ జీవితం నరకంలాగానే అనిపిస్తుంది. అందుకే ఆరోగ్యంగా ఉండం కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామంది ఏదైనా సమస్య వస్తే వెంటనే డాక్టర్ల వద్దకు పరుగెడుతారు. కానీ మన ఇంట్లోనే ఉండే కొన్ని వస్తువులతో ఆ సమస్యలు తీరిపోతాయని మాత్రం తెలుసుకోరు. అలాంటి ఔషధ గుణాలు ఉన్న వాటిల్లో చిట్టి ఆవాలు కూడా ఉంటాయి. వీటితో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
ఆవాలను దోరగా వేయంచుకుని బెల్లాన్ని ఆవాలకు సమానంగా కలపుకుని ముద్దగా చేసుకోవాలి. బబఠాణీ గింజలంత మాత్రలుగా చేసి నిల్వ చేసుకోవాలి. వీటిని పూటకు ఒకటి చొప్పున తీసుకుంటే నీళ్ల విరుచనాలు, జీర్ణ సంబంధిత సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. దాంతో పాటు ఆవాలకు బోదకాలును హరించే గుణం కూడా ఉంది. చాలా మందికి ఈ విషయం తెలియదు. ఆవాలకు తోడు ఉమ్మెత్తాకులు, ఆముదపు చెట్టు వేర్లు, మునగ చెట్టు బెరడు.. వీటన్నింటిని సమానంగా తీసుకుని నీటితో కలిపి మెత్తగా నూరాలి. ఇలా చేసుకున్న మిశ్రమాన్ని బోదకాలు ఉన్న చోట కట్టుకట్టుకోవాలి.
Mustard : చిట్టి ఆవాలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.. తెలిస్తే అస్సలు వదలరు..!
శుభ్రమైన గుడ్డలో ఈ మిశ్రమాన్ని కట్టుకుంటే క్రమంగా వాపులు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ ఆవాలతో మరో లాభం కూడా ఉంది. అదేంటంటే.. ఆవాలను మెత్తగా నూరుకుని ముక్కు దగ్గర వాసన తగిలేటట్టు ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మూర్చ వల్ల స్పృహ కోల్పోయిన వారికి వెంటనే మెలకువ వచ్చేలా చేయొచ్చు. ఇక ఆవాలను నూనెగా మార్చుకుని.. ఇందులో నుంచి 50 గ్రాముల ఆవనూనె, నల్ల తుమ్మ చెట్టు పూలు 20 గ్రాములు మోతాదులో తీసుకోవాలి. ఆవనూనెలో ఈ పూలను వేసి మరిగించుకోవాలి. తర్వాత దాన్ని వడకట్టుకుని నిల్వచేసుకోవాలి.
చెవిలో నుంచి చీములాంటివి కారితే రెండు పూటలా మూడు నుండి నాలుగు చుక్కల మోతాదులో చెవిలో వేస్తే సరిపోతుంది. దాని వల్ల మీ చెవులు శుభ్రంగా అవుతాయి. అంతే కాకుండా చీము కారే సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. దాంతో పాటు నులి పురుగులకు కూడా ఇది బాగా పని చేస్తుంది.
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
This website uses cookies.