Tenant Farmers : కౌలు రైతులకు గుడ్‌న్యూస్.. రూ.2.5 లక్షల వరకు రుణాలు, తెలంగాణలోని ఈ జిల్లాల వారికి ప్రాధాన్యం
ప్రధానాంశాలు:
Tenant Farmers : కౌలు రైతులకు గుడ్‌న్యూస్.. రూ.2.5 లక్షల వరకు రుణాలు, తెలంగాణలోని ఈ జిల్లాల వారికి ప్రాధాన్యం
Tenant Farmers : కౌలు రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పంట పెట్టుబడి ఎలాగూ అప్పులు తేవాల్సిందే, పైగా భూ యజమానికి కౌలు చెల్లించాలి. ఇన్ని వ్యయప్రయాసలు పడుతూ సాగు జీవనం సాగిస్తున్న కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం అందుతుందా అంటే అదీ లేదు. పంట పెట్టుబడి సాయాలు గానీ, పంట రుణాలు గానీ అన్ని భూ యజమానులకే చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కౌలు రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. కొత్త ఆర్థిక సంవత్సరం 2025-26 ఏప్రిల్ 1 నుంచి బ్యాంకులు ప్రాధాన్య రంగాలకు (పీఎస్‌ఎల్) రుణాలు ఇచ్చేందుకు కొత్త రూల్స్ అమల్లోకి తీసుకొచ్చింది.

Tenant Farmers : కౌలు రైతులకు గుడ్‌న్యూస్.. రూ.2.5 లక్షల వరకు రుణాలు, తెలంగాణలోని ఈ జిల్లాల వారికి ప్రాధాన్యం
పీఎస్‌ఎల్ కింద రుణాలు ఎవరికి ఇవ్వాలనే దానిపై ఆర్బీఐ పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. చిన్న రైతులు, చేతి వృత్తుల వాళ్లు, ఎస్సీ, ఎస్టీ కులాల వాళ్లు, స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరు చేయాలని బ్యాంకులను ఆదేశించింది. ఒంటరి మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు, మైనారిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పరిశ్రమలు పెట్టుకునే వారికి రూ.2 లక్షల వరకు రుణం మంజూరు చేయాలని చెప్పింది.
కౌలు రైతుకు రూ.2.50 లక్షల వరకు రుణం
వ్యవసాయ కూలీలకు, పొలం కౌలుకు తీసుకుని సాగు చేసే రైతులకు కూడా పంట రుణాలు మంజూరు చేయాలని స్పష్టం చేసింది. భూమి లేని వారు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తుంటే రూ.2.50 లక్షల వరకు రుణం ఇవ్వాలని స్పష్టం చేసింది. వ్యవసాయ కార్మికులకు, రాతపూర్వక ఒప్పందం లేకుండా నోటి మాటగా యజమాని నుంచి పొలం కౌలుకు తీసుకుని సాగుచేసే రైతులకూ, పంటను పంచుకునే ఒప్పందంతో సాగు చేసేవారికి కూడా సన్న, చిన్నకారు రైతులకిచ్చినట్లే పంట రుణం ఇవ్వాలని తాజాగా ఆర్బీఐ ఆదేశాలిచ్చింది.
దేశవ్యాప్తంగా అధిక జీఎస్‌డీపీ ఉన్న జిల్లాల్లో పీఎస్‌ఎల్ రుణాల పంపిణీకి ప్రాధాన్యమివ్వాలని ఆర్బీఐ తెలిపింది. ఈ జాబితాలో తెలంగాణలో 7 జిల్లాలు ఉన్నాయి. రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, హైదరాబాద్, హన్మకొండ, జనగామ, మేడ్చల్ జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి. దీంతో ఈ జిల్లాల్లో కౌలు రైతులకు రుణాలు లభించనున్నాయి.