Telangana New Ration Card : కొత్త రేషన్ కార్డు కావాలంటే.. ప్రజా పాలన అభయ హస్తం దరఖాస్తు ఫామ్‌లో ఇక్కడ రాయండి… వీడియో..!
ప్రధానాంశాలు:
కొత్త రేషన్ కార్డు కావాలనుకునే వాళ్లు ఇలా చేయండి
దరఖాస్తు ఫామ్ లోనే కొత్త రేషన్ కార్డు అని రాయండి
వెరిఫై చేయనున్న అధికారులు
Telangana New Ration Card : తెలంగాణలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రజా పాలన అభయ హస్తం దరఖాస్తు ఫామ్ నింపే పనిలో ఉన్నారు అందరూ. తెలంగాణ ప్రజలంతా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. కాంగ్రెస్ తీసుకొచ్చిన ఆరు గ్యారెంటీ హామీల అమలు కోసం ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవాలి. ఆ స్కీమ్స్ రావాలంటే జనవరి 6, 2024 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్కీమ్స్ లో అర్హత సాధించాలంటే ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు ఉండాల్సిందే. తెల్ల రేషన్ కార్డు లేకపోతే ఈ స్కీమ్స్ కింద అర్హత లభించదు. అందుకే చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. అటువంటి వాళ్లు అభయ హస్తం ఫామ్ లోనే కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
అభయ హస్తం ఫామ్ లో రేషన్ కార్డు కోసం దరఖాస్తు లేదు కాబట్టి.. మాకు రేషన్ కార్డు కావాలి అని ఫామ్ ఫస్ట్ పేజీలోనే రాయాల్సి ఉంటుంది. ఇప్పటికే కొత్త రేషన్ కార్డు కోసం మీసేవలో దరఖాస్తు చేసుకున్న వాళ్లు ఆ అప్లికేషన్ నెంబర్ ను కూడా ప్రజా పాలన అప్లికేషన్ ఫామ్ ఫస్ట్ పేజీ మీద రాయాల్సి ఉంటుంది. ఆ ఫామ్ లో రేషన్ కార్డు అని రాసిన వాళ్లకు కూడా కొత్త రేషన్ కార్డు పంపిణీ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అధికారులు చెక్ చేసుకొని ఇంటికి వచ్చి వివరాలు వెరిఫై చేసుకొని కావాల్సిన డాక్యుమెంట్స్ తీసుకొని కొత్త రేషన్ కార్డు జారీ చేస్తారు.
కొత్త రేషన్ కార్డ్ కావాలంటే అప్లికేషన్ ఫామ్ పైన" need new ration card"అని వ్రాసి దరఖాస్తు చేసుకోవచ్చు. pic.twitter.com/OuxEBeTKPh
— Akula Srivani ( Modi ka Parivar ) (@akula_srivani) December 28, 2023