Telangana Praja Palana Application Form : ఐదు గ్యారంటీల దరఖాస్తు ఫారం ఏ విధంగా నింపాలి.. ఈ వీడియో చూడండి..!

Telangana Praja Palana Application Form :  తెలంగాణ ప్రభుత్వం అభయహస్తంలో భాగంగా ప్రజా పాలన దరఖాస్తును విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రజా పాలన దరఖాస్తును 28 డిసెంబర్ 2023 నుంచి జనవరి 6, 2024 లోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు మహాలక్ష్మీ, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం తీసుకొచ్చారు. ఈ ఐదు గ్యారెంటీ స్కీమ్స్ కోసం ఒకే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారులే ఈ ఫామ్ ను ఉచితంగా ప్రజలకు అందిస్తారు. గ్రామాల్లో పంచాయతీ ఆఫీసుకు వెళ్తే ఫామ్ ను ఉచితంగా అందిస్తారు. ఈ ఫామ్ తీసుకొని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో అడిగిన అన్ని వివరాలు కరెక్ట్ గా నింపాల్సి ఉంటుంది. దరఖాస్తు సంఖ్య ఇవ్వాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారు వివరాల్లో ఇంటి యజమాని పేరు ఇవ్వాలి. ఆ తర్వాత స్త్రీ, పురుషుడు టికెట్ చేసి.. తమ సామాజిక వర్గం, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, రేషన్ కార్డు నెంబర్, మొబైల్ నెంబర్, వృత్తి వివరాలు ఇవ్వాలి. ఆ తర్వాత కుటుంబ సభ్యుల పేర్లు, వాళ్ల వివరాలు పొందుపరచాలి. వాళ్ల పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత కాలమ్ లో 10 నెంబర్ లో చిరునామా ఇవ్వాలి.

అభయహస్తం గ్యారంటీ పథకాల లబ్ధి పొందటానికి వివరాలు ఆ తర్వాత ఇవ్వాలి. కావాల్సిన పథకాలు కోసం అంటే మీరు ఏ పథకాలకు అర్హత పొందుతారో వాటికే టిక్ పెట్టాలి. మహాలక్ష్మీ పథకం కింద ప్రతి నెల రూ.2500 ఆర్థిక సాయం కోసం టిక్ ఇవ్వాలి. ఆ తర్వాత 500 కే గ్యాస్ సిలిండర్ కోసం గ్యాస్ కనెక్షన్ నెంబర్, సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్యను ఇవ్వాలి. ఆ తర్వాత రైతు భరోసా పథకం కింద రైతులకు ప్రతి ఏటా ఎకరానికి రూ.15 వేలు ఇస్తున్నారు. దాని కోసం రైతు అయితే రైతు మీద టికెట్ చేయాలి. కౌలు రైతు అయితే కౌలు రైతు మీద టిక్ చేయాలి. ఆ తర్వాత పట్టాదారు పాసు పుస్తకం నెంబర్లు ఇవ్వాల్సి ఉంటుంది. సాగు చేస్తున్న భూమి వివరాలు కూడా ఇవ్వాలి. సర్వే నెంబర్, విస్తీర్ణం వివరాలన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ వ్యవసాయ కూలీలు అయితే ఏటా రూ.12 వేల కోసం ఉపాధి హామీ కార్డు నెంబర్ పొందుపర్చాల్సి ఉంటుంది.

Telangana Praja Palana Application Form : ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇల్లు లేని వారికి ఆర్థిక సాయం

ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తారు. ఒకవేళ అమరవీరులు, ఉద్యమకారులు అయితే వాళ్లకు 250 చదరపు గజాల ఇంటి స్థలాన్ని ఇస్తారు. అమరవీరుల పేరు, అమరులైన సంవత్సరం, ఎఫ్ఐఆర్ నెంబర్, డెత్ సర్టిఫికెట్ నెంబర్, తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే అవును అని లేకపోతే కాదు అని ఇవ్వాలి. అవును అని ఇస్తే.. సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబర్, సంవత్సరం, జైలుకు వెళ్లి ఉంటే ఆ వివరాలు కూడా ఇవ్వాలి. జైలు పేరు, స్థలం, శిక్ష సంబంధిత వివరాలు ఇవ్వాలి.

ఆ తర్వాత గృహ జ్యోతి పథకం కింద ప్రతి నెల కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తారు. మీ నెలసరి గృహ విద్యుత్తు వినియోగం ఎంత.. అనేది కూడా చూసుకొని టిక్ మార్క్ చేయాలి. గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ నెంబర్ ఇవ్వాలి. చేయూత పథకం కింద నెలకు రూ.4000, దివ్యాంగుల పింఛన్ కింద రూ.6 వేలు పొందేందుకు కింది వివరాలు ఇవ్వాలి. చేయూత పథకం కింద నెలకు రూ.4 వేలు, దివ్యాంగుల కోసం రూ.6 వేల పింఛన్ ఇస్తారు. అయితే.. ఇందులో ప్రస్తుతం పింఛన్ పొందే వాళ్లు దీని కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. కొత్త వాళ్లు అర్హులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ఫామ్ మొత్తం నింపిన తర్వాత ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ కాపీని జత చేసి సంతకం పెట్టి పేరు, తేదీ ఇవ్వాలి. అధికారి ఆ ఫామ్ ను పరిశీలించి ప్రజా పాలన దరఖాస్తు రశీదు ఇస్తారు. మీరు ఏ స్కీమ్ కోసం దరఖాస్తు చేస్తారో ఆ స్కీమ్ కి టిక్ పెట్టి అధికారి సంతకం పెట్టి రసీదు ఇస్తాడు.

Recent Posts

AI Edge Gallery | ఇంటర్నెట్‌ లేకున్నా ఏఐతో పనిచేసే గూగుల్ కొత్త యాప్ ఏంటో తెలుసా?

AI Edge Gallery | ప్రపంచంలోనే అత్యున్నత టెక్‌ దిగ్గజాల్లో ఒకటైన గూగుల్ (Google), మరోసారి టెక్నాలజీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇంటర్నెట్‌…

3 hours ago

Kalisundam Raa | ‘కలిసుందాం రా’ చిత్రాన్ని ఆ హీరో అలా ఎలా మిస్ చేసుకున్నాడు.. 24 ఏళ్ల తర్వాత మళ్లీ చర్చలోకి!

Kalisundam Raa | విక్టరీ వెంకటేశ్ కెరీర్‌లో ఓ మైలురాయి మూవీగా నిలిచింది ‘కలిసుందాం రా’. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో…

4 hours ago

TG Govt | ఇందిరమ్మ ఇళ్లకు భారీ ఊరట .. నిర్మాణానికి జాతీయ ఉపాధి హామీ పథకం అనుసంధానం

TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది.…

8 hours ago

Accenture | విశాఖకు రానున్న అంతర్జాతీయ ఐటీ దిగ్గజం .. 12 వేల మందికి ఉద్యోగాలు

Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్క‌డ‌ భారీ…

8 hours ago

Digital Arrest | పహల్గాం ఉగ్రదాడిని కూడా వాడేసుకున్న నేరస్తులు .. 26 లక్షలు కోల్పోయిన వృద్ధుడు

Digital Arrest |  సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…

10 hours ago

Pawan Kalyan | ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం త‌న సినిమా ఆపేస్తున్న తేజ సజ్జా.. మెగా ఫ్యాన్స్ ఫిదా

Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…

12 hours ago

Cashew Nuts | జీడిపప్పు ఎక్కువ తింటున్నారా? జాగ్రత్త.. ఇది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది!

Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…

13 hours ago

Belly Fat | బెల్లీ ఫ్యాట్ తగ్గించాలంటే ఈ ఆహారాలు మానేయండి .. ఇక ర‌మ‌న్నా రాదు..!

Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…

14 hours ago