Categories: NewsTelangana

Summer Season : ఎండలతో రోజుకు రూ.2 వేలు సంపాదించే ఐడియా..!

Summer Season : తెలంగాణలో గడిచిన కొద్దిరోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండటంతో ప్రజలు ఎండ వేడిమి నుంచి తప్పించుకునేందుకు శీతల పానీయాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. వడదెబ్బ, డీహైడ్రేషన్‌ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రజలకు అవసరం లేకుంటే బయటకు వెళ్లొద్దని ప్రభుత్వం , డాక్టర్స్ సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సోడా బండ్లు, జ్యూస్‌ షాపుల వ్యాపారం పెరిగిపోయింది. ముఖ్యంగా నకిరేకల్ పట్టణంలో ట్రెండ్ షాపింగ్ మాల్ పక్కన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదురుగా ఉన్న లక్ష్మీ సోడా బండి వద్ద అధిక సంఖ్యలో ప్రజలు చేరుకుంటున్నారు.

Summer Season : ఎండలతో రోజుకు రూ.2 వేలు సంపాదించే ఐడియా

Summer Season ఎండలను క్యాష్ చేసుకొనే ఐడియా

నల్లగొండ జిల్లా నకిరేకల్ మండల పరిధిలోని బొప్పారం గ్రామానికి చెందిన లక్ష్మీ గత ఐదు సంవత్సరాలుగా సోడా బండి నడుపుతోంది. ఒక ప్రమాదంలో భర్త కాలు, తన చేయి విరగడంతో ఆర్థికంగా కష్టాల్లో ఉన్న లక్ష్మీ, కుటుంబ పోషణ కోసం ఈ వ్యాపారాన్ని ప్రారంభించింది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. వేసవి కాలంలో నెలకు రూ. 60,000 ఆదాయం వస్తుండగా, మిగతా కాలంలో రోజుకు సుమారు రూ. 500 సంపాదిస్తోంది. ఈ ఆదాయంతోనే ఆమె తన కుటుంబాన్ని పోషిస్తూ, పిల్లలకు విద్య అందిస్తున్నట్లు వెల్లడించింది.

ప్రస్తుతం ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో సరికొత్త వ్యాపార అవకాశాలు ఏర్పడుతున్నాయి. లక్ష్మీ వంటి సృజనాత్మక ఆలోచన కలిగిన మహిళలు తమ కుటుంబాలను నిలబెట్టుకునేందుకు చిన్న వ్యాపారాలను ఆశ్రయిస్తున్నారు. వడదెబ్బకు గురికాకుండా ప్రజలు ఎక్కువగా సోడా, జ్యూస్ బండ్ల వద్దకు వస్తుండటంతో, ఈ వ్యాపారం మరింత వేగంగా పెరుగుతోంది. ప్రభుత్వం ఇలాంటి చిన్న వ్యాపారులకు మద్దతుగా ఉపాధి సాధన కార్యక్రమాలు చేపడితే మరింత మంది మహిళలు స్వయం ఉపాధిని సాధించి, కుటుంబ పోషణలో ముందడుగు వేయగలిగే అవకాశం ఉంది.

Recent Posts

TGSRTC | టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల కోసం లక్కీ డ్రా.. ₹5.50 లక్షల బహుమతులు సిద్ధం!

TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…

1 hour ago

OG Collections | రికార్డులు క్రియేట్ చేస్తున్న ఓజీ.. తొలి రోజు ఎంత వ‌సూళ్లు రాబ‌ట్టింది అంటే..!

OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…

3 hours ago

OG | ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. ఇక నుండి పెంపు ఉండ‌దు

OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…

5 hours ago

Coconut | కొబ్బరి తినడం మంచిదేనా.. ఇందులో దాగిన‌ అపాయం ఏంటో తెలుసా?

Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…

6 hours ago

Jackfruit seeds | వైరస్‌లకు చెక్ పెట్టే పనస గింజలు.. రోగనిరోధక శక్తి పెంచే ఆరోగ్య రహస్యం ఇదే!

Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…

7 hours ago

Tulsi Leaves | తులసి నీరు ఆరోగ్యానికి చాలా ఉప‌యోగం.. నిపుణులు చెబుతున్న అద్భుత ప్రయోజనాలు

Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…

8 hours ago

Garlic Peel Benefits | వెల్లుల్లి తొక్కలు పనికిరానివి కావు. .. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు

Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…

9 hours ago

Health Tips | బరువు తగ్గాలనుకుంటున్నారా? గ్రీన్ టీ బెటరా? మోరింగ టీ బెటరా?

Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…

10 hours ago