Summer Season : ఎండలతో రోజుకు రూ.2 వేలు సంపాదించే ఐడియా..!
ప్రధానాంశాలు:
Summer Season : ఎండలతో రోజుకు రూ.2 వేలు సంపాదించే ఐడియా
Summer Season : తెలంగాణలో గడిచిన కొద్దిరోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండటంతో ప్రజలు ఎండ వేడిమి నుంచి తప్పించుకునేందుకు శీతల పానీయాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రజలకు అవసరం లేకుంటే బయటకు వెళ్లొద్దని ప్రభుత్వం , డాక్టర్స్ సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సోడా బండ్లు, జ్యూస్ షాపుల వ్యాపారం పెరిగిపోయింది. ముఖ్యంగా నకిరేకల్ పట్టణంలో ట్రెండ్ షాపింగ్ మాల్ పక్కన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదురుగా ఉన్న లక్ష్మీ సోడా బండి వద్ద అధిక సంఖ్యలో ప్రజలు చేరుకుంటున్నారు.

Summer Season : ఎండలతో రోజుకు రూ.2 వేలు సంపాదించే ఐడియా
Summer Season ఎండలను క్యాష్ చేసుకొనే ఐడియా
నల్లగొండ జిల్లా నకిరేకల్ మండల పరిధిలోని బొప్పారం గ్రామానికి చెందిన లక్ష్మీ గత ఐదు సంవత్సరాలుగా సోడా బండి నడుపుతోంది. ఒక ప్రమాదంలో భర్త కాలు, తన చేయి విరగడంతో ఆర్థికంగా కష్టాల్లో ఉన్న లక్ష్మీ, కుటుంబ పోషణ కోసం ఈ వ్యాపారాన్ని ప్రారంభించింది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. వేసవి కాలంలో నెలకు రూ. 60,000 ఆదాయం వస్తుండగా, మిగతా కాలంలో రోజుకు సుమారు రూ. 500 సంపాదిస్తోంది. ఈ ఆదాయంతోనే ఆమె తన కుటుంబాన్ని పోషిస్తూ, పిల్లలకు విద్య అందిస్తున్నట్లు వెల్లడించింది.
ప్రస్తుతం ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో సరికొత్త వ్యాపార అవకాశాలు ఏర్పడుతున్నాయి. లక్ష్మీ వంటి సృజనాత్మక ఆలోచన కలిగిన మహిళలు తమ కుటుంబాలను నిలబెట్టుకునేందుకు చిన్న వ్యాపారాలను ఆశ్రయిస్తున్నారు. వడదెబ్బకు గురికాకుండా ప్రజలు ఎక్కువగా సోడా, జ్యూస్ బండ్ల వద్దకు వస్తుండటంతో, ఈ వ్యాపారం మరింత వేగంగా పెరుగుతోంది. ప్రభుత్వం ఇలాంటి చిన్న వ్యాపారులకు మద్దతుగా ఉపాధి సాధన కార్యక్రమాలు చేపడితే మరింత మంది మహిళలు స్వయం ఉపాధిని సాధించి, కుటుంబ పోషణలో ముందడుగు వేయగలిగే అవకాశం ఉంది.