
Brs Party : జూలై 24వ తేదీపైనే అందరి దృష్టి.. కేసీఆర్ అసెంబ్లీకి వెళతారా, లేదా..?
Brs Party : ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఎంత రంజుగా ఉన్నాయో మనం చూశాం. రెండు తెలుగు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరగా, వారిపై ప్రతిపక్షాలు బాణాలు సంధిస్తున్నాయి. ఈ క్రమంలోనే టార్గెట్ 26… డేట్ 24.. తెలంగాణలో ఈ రెండు నెంబర్ల చుట్టూనే రాజకీయం తిరుగుతోంది. 24వ తేదీలోగా 26 టార్గెట్‌ను చేరుకోవాలని కాంగ్రెస్…. అధికార పార్టీని అడ్డుకుని పార్టీని రక్షించుకోడానికి బీఆర్‌ఎస్…. పోటాపోటీగా కసరత్తులు చేస్తుంది. వారం రోజుల్లో పొలిటికల్ వార్ పీక్స్‌కి చేరుకుంటుందని కొందరు చెప్పుకొస్తున్నారు. బీఆర్‌ఎస్ శాసనసభాపక్షం విలీనమే టార్గెట్‌గా పావులు కదుపుతున్న కాంగ్రెస్ పార్టీ… తన టార్గెట్‌ను చేరుకోడానికి డెడ్‌లైన్‌గా ఈ నెల 24ను ఎంచుకుందని తాజా సమాచారం.
మిగిలిన ఎమ్మెల్యేలను కాపాడుకునే మార్గాలను బీఆర్ఎస్ అన్వేషిస్తోంది. జులై 24 టెన్షన్‌తో బీఆర్‌ఎస్ హైఅలర్ట్‌లో ఉందంటున్నారు. ఈ నెల 24న శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆలోగా బీఆర్‌ఎస్ శాసనసభా పక్షాన్ని విలీనం చేసుకోవాలని టార్గెట్ పెట్టుకుంది కాంగ్రెస్ హైకమాండ్. సీఎం రేవంత్‌రెడ్డికి ఈ విషయంలో పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో… వరుసగా ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు. ప్రస్తుతం 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌కి బైబై చెప్పేసి… అధికార పార్టీతో చేతులు కలిపారు. గత పదేళ్లలో రెండు సార్లు ఇలా ప్రత్యర్థి పార్టీల నుంచి ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకుని కాంగ్రెస్, టీడీపీ శాసనసభా పక్షం విలీనమైనట్లు ప్రకటించారు మాజీ సీఎం కేసీఆర్. ఇప్పుడు ఆయన చూపిన మార్గంలోనే నడుస్తున్నామని చెబుతున్న కాంగ్రెస్ పెద్దలు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై గురిపెట్టారు.
Brs Party : జూలై 24వ తేదీపైనే అందరి దృష్టి.. కేసీఆర్ అసెంబ్లీకి వెళతారా, లేదా..?
మరోవైపు వచ్చే అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరుపైనా ఉత్కంఠ ఏర్పడుతోంది. అధికారం కోల్పోయిన తర్వాత కేవలం ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయడానికి మాత్రమే అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్… ఆ తర్వాత రెండుసార్లు జరిగిన అసెంబ్లీ సెషన్స్‌కు హాజరుకాలేదు. ఇప్పుడు ఆ పార్టీ శాసనసభాపక్షమే లేకుండా చేస్తామని కాంగ్రెస్ సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో.. తమ ఎమ్మెల్యేలను కాపాడుకోడానికైనా మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెడతారా? లేదా.. ఫామ్ హౌస్‌కే పరిమితమవుతారా? అన్నది మాత్రం రాజకీయంగా రక్తికడుతోంది.
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
This website uses cookies.