Brs Party : జూలై 24వ తేదీపైనే అంద‌రి దృష్టి.. కేసీఆర్ అసెంబ్లీకి వెళ‌తారా, లేదా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Brs Party : జూలై 24వ తేదీపైనే అంద‌రి దృష్టి.. కేసీఆర్ అసెంబ్లీకి వెళ‌తారా, లేదా..?

 Authored By ramu | The Telugu News | Updated on :20 July 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Brs Party : జూలై 24వ తేదీపైనే అంద‌రి దృష్టి.. కేసీఆర్ అసెంబ్లీకి వెళ‌తారా, లేదా..?

Brs Party : ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాలు ఎంత రంజుగా ఉన్నాయో మ‌నం చూశాం. రెండు తెలుగు రాష్ట్రాల‌లో కొత్త ప్రభుత్వాలు కొలువుదీర‌గా, వారిపై ప్ర‌తిప‌క్షాలు బాణాలు సంధిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే టార్గెట్‌ 26… డేట్‌ 24.. తెలంగాణలో ఈ రెండు నెంబర్ల చుట్టూనే రాజకీయం తిరుగుతోంది. 24వ తేదీలోగా 26 టార్గెట్‌ను చేరుకోవాలని కాంగ్రెస్‌…. అధికార పార్టీని అడ్డుకుని పార్టీని రక్షించుకోడానికి బీఆర్‌ఎస్‌…. పోటాపోటీగా క‌స‌ర‌త్తులు చేస్తుంది. వారం రోజుల్లో పొలిటిక‌ల్ వార్ పీక్స్‌కి చేరుకుంటుంద‌ని కొంద‌రు చెప్పుకొస్తున్నారు. బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం విలీనమే టార్గెట్‌గా పావులు కదుపుతున్న కాంగ్రెస్‌ పార్టీ… తన టార్గెట్‌ను చేరుకోడానికి డెడ్‌లైన్‌గా ఈ నెల 24ను ఎంచుకుందని తాజా సమాచారం.

Brs Party ఆ డేట్ పైనే అంద‌రి దృష్టి..

మిగిలిన ఎమ్మెల్యేలను కాపాడుకునే మార్గాలను బీఆర్ఎస్ అన్వేషిస్తోంది. జులై 24 టెన్షన్‌తో బీఆర్‌ఎస్‌ హైఅలర్ట్‌లో ఉందంటున్నారు. ఈ నెల 24న శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆలోగా బీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షాన్ని విలీనం చేసుకోవాలని టార్గెట్‌ పెట్టుకుంది కాంగ్రెస్‌ హైకమాండ్‌. సీఎం రేవంత్‌రెడ్డికి ఈ విషయంలో పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో… వరుసగా ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు‌. ప్రస్తుతం 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌కి బైబై చెప్పేసి… అధికార పార్టీతో చేతులు కలిపారు. గత పదేళ్లలో రెండు సార్లు ఇలా ప్రత్యర్థి పార్టీల నుంచి ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకుని కాంగ్రెస్‌, టీడీపీ శాసనసభా పక్షం విలీనమైనట్లు ప్రకటించారు మాజీ సీఎం కేసీఆర్‌. ఇప్పుడు ఆయన చూపిన మార్గంలోనే నడుస్తున్నామని చెబుతున్న కాంగ్రెస్‌ పెద్దలు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై గురిపెట్టారు.

Brs Party జూలై 24వ తేదీపైనే అంద‌రి దృష్టి కేసీఆర్ అసెంబ్లీకి వెళ‌తారా లేదా

Brs Party : జూలై 24వ తేదీపైనే అంద‌రి దృష్టి.. కేసీఆర్ అసెంబ్లీకి వెళ‌తారా, లేదా..?

మరోవైపు వచ్చే అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్‌ హాజరుపైనా ఉత్కంఠ ఏర్పడుతోంది. అధికారం కోల్పోయిన తర్వాత కేవలం ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయడానికి మాత్రమే అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్‌… ఆ తర్వాత రెండుసార్లు జరిగిన అసెంబ్లీ సెషన్స్‌కు హాజరుకాలేదు. ఇప్పుడు ఆ పార్టీ శాసనసభాపక్షమే లేకుండా చేస్తామని కాంగ్రెస్‌ సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో.. తమ ఎమ్మెల్యేలను కాపాడుకోడానికైనా మాజీ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో అడుగుపెడతారా? లేదా.. ఫామ్‌ హౌస్‌కే పరిమితమవుతారా? అన్నది మాత్రం రాజకీయంగా రక్తికడుతోంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది