Kalvakunta Himanshu : తెలంగాణ నెక్స్ ట్ సీఎం కేటీఆర్.. అంత సీన్ లేదన్న కేసీఆర్ మనవడు హిమన్షు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kalvakunta Himanshu : తెలంగాణ నెక్స్ ట్ సీఎం కేటీఆర్.. అంత సీన్ లేదన్న కేసీఆర్ మనవడు హిమన్షు?

 Authored By jagadesh | The Telugu News | Updated on :21 January 2021,4:05 pm

Kalvakunta Himanshuకల్వకుంట్ల హిమన్షు తెలుసు కదా. అదేనండి.. తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు… తెలంగాణ మంత్రి కేటీఆర్ కొడుకు. యావత్ కల్వకుంట్ల వంశానికే ఏకైక వారసుడు హిమన్షు. ఈయన్ను ముద్దుగా కేహెచ్ఆర్ అని పిలుస్తుంటారు. అవును.. తన తాత కేసీఆర్.. తండ్రి కేటీఆర్.. తను కేహెచ్ఆర్. భలే సెట్ అయ్యాయి కదా పేర్లు. హిమన్షు అప్పుడప్పుడు న్యూస్ లో నానుతుంటాడు. హిమన్షుకు ఆమధ్య ఆరోగ్యం బాగాలేదని పుకార్లు కూడా వచ్చాయి. తర్వాత అదంతా ఉత్తిదే అని తెలిసింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హిమన్షు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. ఎందుకు? ఏమిటి? ఏలా? తెలుసుకుందాం పదండి..

kalvakuntla himanshu rao gives clarity on change of telangana cm

kalvakuntla himanshu rao gives clarity on change of telangana cm

ప్రస్తుతం తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పునకు సంబంధించిన వార్త తెగ హల్ చల్ చేస్తోంది. సీఎం కేసీఆర్.. తన కొడుకు కేటీఆర్ కు ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించేసి.. తను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని అనుకుంటున్నారు.. అనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఫిబ్రవరిలోనే కేటీఆర్ కు పట్టాభిషేకం అంటున్నారు. అయితే.. వీటిలో నిజమెంత? అబద్ధమెంత అనేది మాత్రం తెలియదు. కానీ.. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేంటి.. అని టీఆర్ఎస్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు బహిరంగంగానే చెబుతున్నారు. దీంతో కేటీఆర్ ను కేసీఆర్ త్వరలోనే ముఖ్యమంత్రిని చేస్తారు.. అనే వార్తలు గుప్పుమంటున్నాయి.

ఈనేపథ్యంలో కేసీఆర్ మనవడు, కేటీఆర్ కొడుకు హిమన్షు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో దుమారం లేపాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 Kalvakunta Himanshu:  ఆస్క్ మీ ఎనీ థింగ్ యూ లైక్.. అంటూ ఇన్ స్టాగ్రామ్ లో హిమన్షు పోస్టు

హిమన్షు తాజాగా.. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో తన అభిమానులతో, నెటిజన్లతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఆస్క్ మీ ఎనీ థింగ్ యూ లైక్.. అంటూ ఓ క్వశ్చన్ సెషన్ ను హిమన్షు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్లు.. హిమన్షును కేటీఆర్ గురించి ఓ ప్రశ్న అడిగాడు. ఫిబ్రవరి 20 తర్వాత తెలంగాణ సీఎం కేటీఆర్ అంటున్నారు. ఇందులో నిజమెంత బ్రో.. అంటూ ప్రశ్న వేశాడు.

దీనికి సమాధానంగా హిమన్షు ఏం చెప్పాడో తెలుసా? మా ఇంట్లో ఉన్నప్పుడు తాతయ్య, నాన్న అసలు రాజకీయాల గురించే మాట్లాడరు. వాళ్లు ఎక్కువగా రిలాక్స్ అవ్వడానికే ప్రయత్నిస్తారు. రాజకీయాలు ఇంట్లో చర్చకే రావు. అంటూ భలే తెలివిగా సమాధానం చెప్పేశాడు కేహెచ్ఆర్. ఎంతైనా కేసీఆర్ మనవడు కదా. ఆ మాత్రం ఉంటుంది లెండి.

నాకు పాలిటిక్స్ అంటేనే అసహ్యం

నాకు పాలిటిక్స్ అంటేనే అసహ్యం.. నేనైతే పాలిటిక్స్ లోకి అస్సలు రాను.. అంటూ మరో నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కేటీఆర్ గురించి ఒక్క ముక్కలో చెప్పండి.. అని మరో నెటిజన్ అడగగా.. కూల్ అంటూ సమాధానం చెప్పాడు.

Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది