Kalvakunta Himanshu – కల్వకుంట్ల హిమన్షు తెలుసు కదా. అదేనండి.. తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు… తెలంగాణ మంత్రి కేటీఆర్ కొడుకు. యావత్ కల్వకుంట్ల వంశానికే ఏకైక వారసుడు హిమన్షు. ఈయన్ను ముద్దుగా కేహెచ్ఆర్ అని పిలుస్తుంటారు. అవును.. తన తాత కేసీఆర్.. తండ్రి కేటీఆర్.. తను కేహెచ్ఆర్. భలే సెట్ అయ్యాయి కదా పేర్లు. హిమన్షు అప్పుడప్పుడు న్యూస్ లో నానుతుంటాడు. హిమన్షుకు ఆమధ్య ఆరోగ్యం బాగాలేదని పుకార్లు కూడా వచ్చాయి. తర్వాత అదంతా ఉత్తిదే అని తెలిసింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హిమన్షు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. ఎందుకు? ఏమిటి? ఏలా? తెలుసుకుందాం పదండి..
ప్రస్తుతం తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పునకు సంబంధించిన వార్త తెగ హల్ చల్ చేస్తోంది. సీఎం కేసీఆర్.. తన కొడుకు కేటీఆర్ కు ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించేసి.. తను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని అనుకుంటున్నారు.. అనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఫిబ్రవరిలోనే కేటీఆర్ కు పట్టాభిషేకం అంటున్నారు. అయితే.. వీటిలో నిజమెంత? అబద్ధమెంత అనేది మాత్రం తెలియదు. కానీ.. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేంటి.. అని టీఆర్ఎస్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు బహిరంగంగానే చెబుతున్నారు. దీంతో కేటీఆర్ ను కేసీఆర్ త్వరలోనే ముఖ్యమంత్రిని చేస్తారు.. అనే వార్తలు గుప్పుమంటున్నాయి.
ఈనేపథ్యంలో కేసీఆర్ మనవడు, కేటీఆర్ కొడుకు హిమన్షు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో దుమారం లేపాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
హిమన్షు తాజాగా.. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో తన అభిమానులతో, నెటిజన్లతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఆస్క్ మీ ఎనీ థింగ్ యూ లైక్.. అంటూ ఓ క్వశ్చన్ సెషన్ ను హిమన్షు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్లు.. హిమన్షును కేటీఆర్ గురించి ఓ ప్రశ్న అడిగాడు. ఫిబ్రవరి 20 తర్వాత తెలంగాణ సీఎం కేటీఆర్ అంటున్నారు. ఇందులో నిజమెంత బ్రో.. అంటూ ప్రశ్న వేశాడు.
దీనికి సమాధానంగా హిమన్షు ఏం చెప్పాడో తెలుసా? మా ఇంట్లో ఉన్నప్పుడు తాతయ్య, నాన్న అసలు రాజకీయాల గురించే మాట్లాడరు. వాళ్లు ఎక్కువగా రిలాక్స్ అవ్వడానికే ప్రయత్నిస్తారు. రాజకీయాలు ఇంట్లో చర్చకే రావు. అంటూ భలే తెలివిగా సమాధానం చెప్పేశాడు కేహెచ్ఆర్. ఎంతైనా కేసీఆర్ మనవడు కదా. ఆ మాత్రం ఉంటుంది లెండి.
నాకు పాలిటిక్స్ అంటేనే అసహ్యం.. నేనైతే పాలిటిక్స్ లోకి అస్సలు రాను.. అంటూ మరో నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కేటీఆర్ గురించి ఒక్క ముక్కలో చెప్పండి.. అని మరో నెటిజన్ అడగగా.. కూల్ అంటూ సమాధానం చెప్పాడు.
Saffron : మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో దంపతులు దేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్లో ప్రధానంగా పండించే 'కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు.…
Hyundai Kia EV Cars : పవర్ డ్రైవ్ సమస్య కారణంగా వాహన తయారీదారులు హ్యుందాయ్ మరియు కియా అమెరికాలో…
Pushpa 2 Rashmika Mandanna : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్…
Elon Musk : చరిత్రలోనే అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్ నిలిచారు. ఎలాన్ మస్క్ అధికారికంగా 334.3 బిలియన్ల డాలర్ల…
Nayanthara : కోలీవుడ్ Kollywood క్రేజీ జంటలలో విఘ్నేష్ శివన్, నయనతార జంట ఒకటి. నయనతారను పెళ్లాడిన తరువాత దర్శకుడిగా…
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తాజా ఎపిసోడ్లో మెగా…
Ind Vs Aus 1st Test Match : పెర్త్ వేదికగా భారత్, ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్…
Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది.…
This website uses cookies.