Kavitha : నేను లేఖ రాస్తే నీకు నొప్పి ఏందిరా బాయ్ ?.. కవిత పరోక్ష వ్యాఖ్యలు
Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలు పార్టీ రాజకీయాల్లో భిన్నతలకు నిదర్శనంగా నిలిచాయి. “మా నాన్నకు లేఖ రాస్తే తప్పేంటీ? నీకు నొప్పి ఏందిరా బాయ్?” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు, పార్టీలో కొందరు నేతల తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయని స్పష్టమవుతోంది. ఇంటి ఆడబిడ్డపై విమర్శలు చేయడం సరికాదని ఆమె పేర్కొన్నారు. కేసీఆర్ నేతృత్వంలో పనిచేస్తున్న వారే తనపై ప్రతాపం చూపిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆమెను “రేవంత్ రెడ్డి కోవర్ట్”గా అభివర్ణించడం అనుచితమని పేర్కొంటూ, తాను అసలే మంచిదాన్ని కాదని, నోరు విప్పితే తట్టుకోలేరని హెచ్చరించారు…
Kavitha : నేను లేఖ రాస్తే నీకు నొప్పి ఏందిరా బాయ్ ?.. కవిత పరోక్ష వ్యాఖ్యలు
కవిత బీఆర్ఎస్ పార్టీలోని కొందరు నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తూ, పెయిడ్ ఆర్టిస్టులు, యూట్యూబ్ ఛానళ్లతో కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. తాను జైలు లోపల ఉన్నప్పుడే బీజేపీతో బీఆర్ఎస్ కలవకూడదని కేసీఆర్‌కు చెప్పినట్లు గుర్తుచేశారు. తాను పదవికి రాజీనామా చేయదలచుకున్నప్పటికీ, కేసీఆర్ ఆపడంతోనే కొనసాగుతున్నానని తెలిపారు. బీజేపీ నేతల ఆసుపత్రుల ప్రారంభోత్సవాలకు హాజరయ్యేది ఎవరో అందరికీ తెలుసునని చెప్పి, పరోక్షంగా పార్టీ నేతలే తనను అర్థం చేసుకోలేదన్న అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతేకాకుండా, నిజామాబాద్ ఎంపీగా తన ఓటమికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కారణమని ఘాటుగా విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారని, కేంద్రం మాత్రం స్పందించకపోవడం బాధాకరమన్నారు. గోదావరి జలాల పంపకం సరిగ్గా జరగకపోవడాన్ని కండించి, బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. కాళేశ్వరంపై కేసీఆర్‌కు నోటీసులు వచ్చినా పార్టీ ఎందుకు స్పందించలేదని ఆమె నిలదీశారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించానన్న ఆరోపణలను ఖండిస్తూ, తన పార్టీ బీఆర్ఎస్, తన నాయకుడు కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న వారిని గౌరవిస్తానని చెప్పినా, వారి నాయకత్వాన్ని మాత్రం మన్నించలేనని తేల్చిచెప్పారు. ఈ వ్యాఖ్యలన్నింటితో పార్టీ లోని అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి.
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
This website uses cookies.