Kavitha : ఎమ్మెల్సీ క‌విత‌కి ఊహించ‌ని దెబ్బ‌….! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kavitha : ఎమ్మెల్సీ క‌విత‌కి ఊహించ‌ని దెబ్బ‌….!

 Authored By ramu | The Telugu News | Updated on :20 March 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Kavitha : ఎమ్మెల్సీ క‌విత‌కి ఊహించ‌ని దెబ్బ‌....!

Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై ఏడూ రోజుల ఈడీ కస్టడీలో ఉన్న విష‌యం తెలిసిందే. ఇన్నాళ్లు క‌విత అరెస్ట్ గురించి ప‌లు వార్త‌లు రాగా, రీసెంట్‌గా ఆమె ఇంటికి వెళ్లి ఈడీ అధికారులు క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. ఇక ఇటీవ‌ల తన కొడుకు, తల్లిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ క‌విత‌ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు కవితకు అనుమతినిచ్చింది కోర్టు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతిని ఇవ్వ‌గా, ఇటీవ‌ల మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు కవితని క‌లిసి ధైర్యం చెప్పారు. అయితే క‌విత కేసులో ఇప్పుడు అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ తీస్ హాజరీ కోర్టుకు బదిలీ అయ్యారు.

ఆయన స్థానంలో జస్టిస్ కావేరి భావేజా నియమితులయ్యారు.ఇప్పుడు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ, ఇతర కేసులను విచారించనున్నారు. ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ జరుగుతున్న రోజు జడ్జ్ జస్టిస్ నాగ్ పాల్ అనూహ్యంగా బదిలీ కావటం ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఇదిలా ఉంటే ఢిల్లీ హైకోర్టు జ్యూడిషియల్ సర్వీసెస్ లోని మరో 26 మంది జడ్జీలు బదిలీ అయ్యారు. ఇక ఇదిలా ఉంటే మార్చి 15న అరెస్టయిన కవిత ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. మార్చి 23 వరకు కవిత ఈడీ కస్టడీలోనే ఉండనున్న‌ట్టు తెలుస్తుంది.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు కవిత రూ. 100 కోట్లు చెల్లించారని ఈడీ ప్రకటించిన విష‌యం విదిత‌మే.

మనీలాండరింగ్ కేసులో నిందితుడైన సుఖేష్ చంద్రశేఖర్ కవితకు లేఖ రాయడం కూడా హాట్ టాపిక్ అయింది. సినిమా క్లైమాక్స్ చేరుకుందని, ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అవుతారని ఆ లేఖలో సుఖేష్ పేర్కొన్నారు. ఇటీవ‌ల ఈడీ రిమాండ్‌ను రద్దు చేయాలంటూ భారత సర్వోన్నత న్యాయస్థానంలో కవిత తరఫున ఆమె న్యాయవాది పిటిషన్ దాఖలు చేయ‌గా, అందులో కవితను వెంటనే విడుదల చేయాలని ఆ పిటిషన్‌లో న్యాయవాది కోరారు. ఏది ఏమైన తెలంగాణ‌లో క‌విత కేసు హాట్ టాపిక్‌గా ఉన్న నేప‌థ్యంలో జ‌డ్జి బ‌దిలీ కావ‌డం సంచ‌ల‌నంగా మారింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది