KCR : మూడోసారి గెలుస్తాన‌ని 66 కోట్లు పెట్టి 22 ల్యాండ్ క్రూజర్లు కార్లు కొన్న కేసీఆర్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

KCR : మూడోసారి గెలుస్తాన‌ని 66 కోట్లు పెట్టి 22 ల్యాండ్ క్రూజర్లు కార్లు కొన్న కేసీఆర్‌..!

KCR : తెలంగాణలో మూడో సారి అధికారంలోకి వస్తామని బల్ల గుద్ది మరీ చెప్పిన బీఆర్ఎస్ పార్టీ చివరకు చతికిలపడింది. 39 సీట్లకే సరిపెట్టుకుంది. తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి ఏపీని మాత్రం కాంగ్రెస్ చాలా ఏళ్ల పాటు పాలించినా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే.. తెలంగాణ ఉద్యమంతో ఫేమస్ అయి.. ఆ తర్వాత తెలంగాణ కలను సాకారం చేసి అదే పార్టీని రాజకీయ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :27 December 2023,6:18 pm

ప్రధానాంశాలు:

  •  22 ల్యాండ్ క్రూజర్లను కొన్న కేసీఆర్

  •  80 కోట్లు పెట్టి కార్లు కొన్న కేసీఆర్

  •  కేసీఆర్ సృష్టించిన సంపద ఇదే

KCR : తెలంగాణలో మూడో సారి అధికారంలోకి వస్తామని బల్ల గుద్ది మరీ చెప్పిన బీఆర్ఎస్ పార్టీ చివరకు చతికిలపడింది. 39 సీట్లకే సరిపెట్టుకుంది. తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి ఏపీని మాత్రం కాంగ్రెస్ చాలా ఏళ్ల పాటు పాలించినా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే.. తెలంగాణ ఉద్యమంతో ఫేమస్ అయి.. ఆ తర్వాత తెలంగాణ కలను సాకారం చేసి అదే పార్టీని రాజకీయ పార్టీగా మార్చి రెండు సార్లు అధికారంలోకి వచ్చారు కేసీఆర్. మూడోసారి కూడా అధికారంలోకి వచ్చి తెలంగాణలో చరిత్ర సృష్టించాలని అనుకున్నారు కానీ.. ఆ కోరిక మాత్రం నెరవేరలేదు. తెలంగాణకు రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 20 రోజులకు కేసీఆర్ కు సంబంధించి ఓ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తాజాగా అభయ హస్తం స్కీమ్ లాంచ్ లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఓ ముఖ్యమైన విషయాన్ని మీడియాకు తెలియజేశారు. మూడోసారి కూడా ముఖ్యమంత్రి అవుతానని అనుకొని.. మూడోసారి అధికారంలోకి వస్తామని ముందే 22 ల్యాండ్ క్రూజర్ వాహనాలను కేసీఆర్ కొనుగోలు చేశారట. ఆ కార్లకు ఒక్కో కారు ధర మూడున్నర కోట్లు ఉంటుందట. అంటే.. సుమారు 80 కోట్లు ఖర్చు పెట్టి 22 ల్యాండ్ క్రూజర్ కార్లను కేసీఆర్ కొన్నారట. బుల్లెట్ ప్రూఫ్ చేయిస్తే ఇంకా ఖర్చు పెరుగుతుంది. ఎన్నికలకు ముందే.. అంటే ఎన్నికల కోడ్ రాకముందే 22 కార్లను కొని విజయవాడలో కేసీఆర్ దాచిపెట్టారట. కేసీఆర్ సృష్టించిన సంపద ఏదైనా ఉందంటే అది ఇదే.. ముఖ్యమంత్రిగా ఈ విషయం తెలుసుకోవడానికి నాకే 10 రోజుల సమయం పట్టిందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

నేను పాత బండ్లను అడ్జస్ట్ చేయమని నేను చెప్పాను. ఓ అధికారి వచ్చి ఈ విషయం చెప్పారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ వాహనాలను తీసుకురావాలని ప్లాన్ చేశారట. 22 కార్లు అంటే మామూలు విషయమా? ప్రభుత్వ ఆస్తి అది.. ఖచ్చితంగా వాటిని స్వాధీనం చేసుకుంటాం అని రేవంత్ రెడ్డి మీడియాకు తెలిపారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది