Telangana : ఇదొక్కటీ జరిగితే KCR మళ్ళీ CM పక్కా..!

Authored By Siddhu Manchikanti | The Telugu News | Updated on : 19 April 2026, 4:30 pm
  •  Telangana : ఇదొక్కటీ జరిగితే KCR మళ్ళీ CM పక్కా..!

Telangana : తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది. అదేంటంటే, కొంతకాలంగా ఫామ్ హౌస్ కే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్ళీ జనంలోకి రాబోతున్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన తర్వాత, గత ఎన్నికల్లో ఓటమిని చూసిన కేసీఆర్, ఆ తర్వాత రాజకీయాలకు, ప్రజలకు కాస్త దూరంగానే ఉన్నారు. అయితే, ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఈ నెల 20 నుంచి ఆయన వరుసగా బహిరంగ సభల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. జగిత్యాలలో జరగబోయే భారీ సభే దీనికి ఆరంభం అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడంతో పాటు, ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నారు.

Telangana : ఇదొక్కటీ జరిగితే KCR మళ్ళీ CM పక్కా..!

Telangana : ఇదొక్కటీ జరిగితే KCR మళ్ళీ CM పక్కా..!

ప్రజల నాడి పట్టుకోవడంలో కేసీఆర్ దిట్ట. ఆయన మళ్ళీ ప్రజల్లోకి వస్తే పార్టీలో కొత్త జోష్ వస్తుందని, కార్యకర్తలకు భరోసా పెరుగుతుందని గులాబీ దళం బలంగా నమ్ముతోంది. ముఖ్యంగా ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎండగట్టడం, ప్రజల సమస్యలపై పోరాటం చేయడం ద్వారా మళ్ళీ పాత రోజులను తీసుకురావచ్చని వారు భావిస్తున్నారు. హరీష్ రావు కూడా కేసీఆర్ రాకతో ప్రభుత్వం నిద్రపోతుంది, అవినీతి అంతమవుతుంది అని గట్టిగానే హెచ్చరిస్తున్నారు. కేసీఆర్ మళ్ళీ జనంలోకి రావడం, పాత సెంటిమెంట్ ను రగిలించడం గనుక జరిగితే, అది కేసీఆర్ ను మళ్ళీ అధికార పీఠంపై కూర్చోబెట్టే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

Telangana ప్రజల మనసు గెలిచే వ్యూహం

ఇన్నాళ్లూ పార్టీకి దూరంగా ఉన్న నాయకుడు ఒక్కసారిగా ప్రజల్లోకి రావడం, నేరుగా వారి సమస్యలపై గళం విప్పడం అనేది సాధారణ విషయం కాదు. ఇది తెలంగాణ సెంటిమెంట్ ను మళ్ళీ యాక్టివేట్ చేస్తుంది. ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను, గతంలో ప్రజలు కేసీఆర్ పాలనలో పొందిన అనుభూతులను ఈ సభల ద్వారా ఆయన గుర్తు చేసే ప్రయత్నం చేస్తారు. కేసీఆర్ గనుక తన పాత శైలిలో దూకుడు పెంచి, ప్రజలకు దగ్గరైతే, మళ్ళీ ఆయనే సిఎం కావడానికి ఆస్కారం ఉందని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, కేసీఆర్ మళ్ళీ రణరంగంలోకి దిగడం తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలకనుంది. ఆయన వ్యూహాలు ఎలా ఉంటాయో, ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisement

Siddhu Manchikanti

Siddhu Manchikanti is a seasoned media professional and digital strategist with over 15+ years of experience in the Telugu media landscape. Currently serving as the Chief Editor of thetelugunews.com and a Content Manager at News Orbit, he has held key editorial and reporting roles at prominent organizations such as Hindustan Times, AP herald, KoradaNews , News Marg, Chai Bisket, and Mallemala Entertainments. His expertise spans script evaluation for short-form series, news analysis, and digital marketing, combined with a deep understanding of South Indian politics and cinema. An expert in transitioning creative screenplays into production, and Siddhu leverages his technical proficiency and editorial leadership to drive high-impact content strategy across multiple digital platforms.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి