
MP Arvind : రాజకీయాలను నాశనం చేసిన కేసీఆర్ కుటుంబం : ఎంపీ అరవింద్
MP Arvind : మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ Brs party అధినేత కేసీఆర్ KCR రాష్ట్ర రాజకీయాలను నాశనం చేసిండని ఎంపీ ధర్మపురి అర్వింద్ MP Dharmapuri Arvind అన్నారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ విలువలను కేసీఆర్ కుటుంబం పాతాళానికి తొక్కేసిందని వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ TDP, కాంగ్రెస్ Congress, బీజేపీ BJP, వామపక్షాలు, ఇతర పార్టీలు ప్రజా క్షేత్రంలో ఉన్నప్పటికీ పరస్పరం విమర్శలు చేసుకున్నారన్నారు.
MP Arvind : రాజకీయాలను నాశనం చేసిన కేసీఆర్ కుటుంబం : ఎంపీ అరవింద్
కానీ, బీఆర్ఎస్ పార్టీ BRS ఆవిర్భవించాక రాజకీయాల్లో ఒక పార్టీ నేతలపై మరో పార్టీ నేతల భౌతిక దాడులు ఎక్కువైనట్లు తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు ప్రతిపక్ష నేతలపై దాడులు, అక్రమ కేసులు బనాయించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
ప్రభుత్వం పథకాల అమలులో గులాబీ పార్టీ విపరీతమైన అవినీతికి పాల్పడిందన్నారు. ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేసి రెండోసారి బీఆర్ఎస్ అధికారంలో వచ్చిన విషయం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. స్వరాష్ట్ర సాధనకు అందరితో పాటే కేసీఆర్ కూడా పోరాడినట్లు చెప్పారు. 2014 వరకు ఆయనపై గౌరవం ఉండేదని, ఎప్పుడైతే అధికారం చేతికొచ్చిందో అప్పటినుంచే ఆ మనిషి మారిపోయాడన్నారు. రాజకీయాలను, వ్యవస్థలను ఆయన పూర్తిగా భ్రష్టు పట్టించినట్లు దుయ్యబట్టారు. నెత్తి మీద టోపీ పెట్టుకునే వాళ్లు తప్పా, ప్రజలెవరూ మళ్లీ బీఆర్ఎస్ పాలనను కోరుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.