MP Arvind : రాజకీయాలను నాశనం చేసిన‌ కేసీఆర్ కుటుంబం : ఎంపీ అర‌వింద్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

MP Arvind : రాజకీయాలను నాశనం చేసిన‌ కేసీఆర్ కుటుంబం : ఎంపీ అర‌వింద్

 Authored By prabhas | The Telugu News | Updated on :20 February 2025,5:20 pm

ప్రధానాంశాలు:

  •  MP Arvind : రాజకీయాలను నాశనం చేసిన‌ కేసీఆర్ కుటుంబం : ఎంపీ అర‌వింద్

MP Arvind : మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ Brs party  అధినేత‌ కేసీఆర్‌ KCR రాష్ట్ర రాజకీయాలను నాశనం చేసిండ‌ని ఎంపీ ధర్మపురి అర్వింద్ MP Dharmapuri Arvind అన్నారు. గురువారం మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ.. రాజకీయ విలువలను కేసీఆర్ కుటుంబం పాతాళానికి తొక్కేసిందని వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ TDP, కాంగ్రెస్ Congress, బీజేపీ BJP, వామపక్షాలు, ఇతర పార్టీలు ప్రజా క్షేత్రంలో ఉన్నప్పటికీ పరస్పరం విమర్శలు చేసుకున్నారన్నారు.

MP Arvind రాజకీయాలను నాశనం చేసిన‌ కేసీఆర్ కుటుంబం ఎంపీ అర‌వింద్

MP Arvind : రాజకీయాలను నాశనం చేసిన‌ కేసీఆర్ కుటుంబం : ఎంపీ అర‌వింద్

కానీ, బీఆర్ఎస్ పార్టీ BRS ఆవిర్భ‌వించాక‌ రాజకీయాల్లో ఒక పార్టీ నేతలపై మరో పార్టీ నేతల భౌతిక దాడులు ఎక్కువైన‌ట్లు తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు ప్రతిపక్ష నేతలపై దాడులు, అక్రమ కేసులు బనాయించిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుర్తు చేశారు.

MP Arvind  నెత్తి మీద టోపీ పెట్టుకునే వాళ్లు తప్పా

ప్రభుత్వం పథకాల అమలులో గులాబీ పార్టీ విపరీతమైన అవినీతికి పాల్పడిందన్నారు. ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేసి రెండోసారి బీఆర్ఎస్ అధికారంలో వచ్చిన విషయం వాస్తవం కాదా అని ఆయ‌న‌ ప్రశ్నించారు. స్వరాష్ట్ర సాధనకు అందరితో పాటే కేసీఆర్ కూడా పోరాడిన‌ట్లు చెప్పారు. 2014 వరకు ఆయనపై గౌరవం ఉండేదని, ఎప్పుడైతే అధికారం చేతికొచ్చిందో అప్ప‌టినుంచే ఆ మనిషి మారిపోయాడన్నారు. రాజకీయాలను, వ్యవస్థలను ఆయన పూర్తిగా భ్రష్టు పట్టించిన‌ట్లు దుయ్య‌బ‌ట్టారు. నెత్తి మీద టోపీ పెట్టుకునే వాళ్లు తప్పా, ప్రజలెవరూ మళ్లీ బీఆర్ఎస్ పాలనను కోరుకోవడం లేదని ఆయ‌న పేర్కొన్నారు.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది