KTR : రేవంత్‌ని కేటీఆర్ అంత మాట అనేశాడు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

KTR : రేవంత్‌ని కేటీఆర్ అంత మాట అనేశాడు..!

 Authored By ramu | The Telugu News | Updated on :26 February 2025,6:13 pm

ప్రధానాంశాలు:

  •  KTR : రేవంత్‌ని కేటీఆర్ అంత మాట అనేశాడు..!

KTR  : అధికారం కోల్పోయిన‌ప్ప‌టి నుండి కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ KTR విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో హోం మంత్రి, విద్యా మంత్రి, సంక్షేమ శాఖ మంత్రి లేరని.. మంత్రివర్గ విస్తరణ కూడా చేయలేని సీఎం రేవంత్ అని ఫైరయ్యారు.

KTR రేవంత్‌ని కేటీఆర్ అంత మాట అనేశాడు

KTR : రేవంత్‌ని కేటీఆర్ అంత మాట అనేశాడు..!

KTR  మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ చేత‌కాదు..

లక్కీగా సీఎం సీట్లో కూర్చున్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఆ గెలుపును నిలబెట్టుకోలేక ఢిల్లీకి Delhi 36 సార్లు పరిగెడుతున్నాడని విమర్శించారు. ఎన్నిసార్లు వెళ్లినా.. రాష్ట్రానికి ప్రయోజనం లేకుండా పోతుందని ఫైరయ్యారు.హోంశాఖ ,విద్యాశాఖ, సంక్షేమ శాఖకు మంత్రులను కూడా నియమించుకోలేని అసమర్ధుడు రేవంత్ రెడ్డి.. తెలంగాణ నుంచి కేసీఆర్ ఆనవాళ్లను చెరిపి వేస్తాడా అని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డికి నిద్రలో కూడా కేసీఆర్ KCR యాదికొస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ఢిల్లీ వెళ్లడం తప్పా తెలంగాణకు రేవంత్ ఏం చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. రైతులు ఆత్మహత్య ,టన్నెల్ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుపోయారు. కానీ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎన్నికల ప్రచారంలో మునిగిపోయాడు అని కేటీఆర్ విమర్శించారు. మ‌రి దీనిపై రేవంత్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది