Rtion Card : ఏపీ ప్ర‌జ‌ల‌కి గొప్ప శుభ‌వార్త‌.. కొత్త రేష‌న్ కార్డుల జారీపైన అదిరిపోయే అప్‌డేట్‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rtion Card : ఏపీ ప్ర‌జ‌ల‌కి గొప్ప శుభ‌వార్త‌.. కొత్త రేష‌న్ కార్డుల జారీపైన అదిరిపోయే అప్‌డేట్‌

 Authored By ramu | The Telugu News | Updated on :26 February 2025,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Rtion Card : ఏపీ ప్ర‌జ‌ల‌కి గొప్ప శుభ‌వార్త‌.. కొత్త రేష‌న్ కార్డుల జారీపైన అదిరిపోయే అప్‌డేట్‌

Rtion Card  : రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh ప్రభుత్వం చర్యలు మొదలెట్టింది. తాము అధికారంలోకి వస్తే కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి హామీ ఇవ్వ‌డం మ‌నకు తెలిసిందే. వాస్తవానికి సంక్రాంతి సమయంలోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారంటూ వార్తలు వచ్చాయి. డిసెంబర్ నెలలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారని, సంక్రాంతి నాటికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తారంటూ గతంలో ప్రచారం జరిగింది. అయితే వివిధ కారణాలతో ఆ దిశగా అడుగులు పడలేదు. ఇప్పుడు మార్చి నెల నుండి రాష్ట్రంలో క్యూఆర్ కోడ్‌తో కొత్త రేష‌న్ కార్డ్ లు అందించ‌నున్న‌ట్టు నాదెండ్ల మ‌నోహ‌ర్ అన్నారు.

Rtion Card ఏపీ ప్ర‌జ‌ల‌కి గొప్ప శుభ‌వార్త‌ కొత్త రేష‌న్ కార్డుల జారీపైన అదిరిపోయే అప్‌డేట్‌

Rtion Card : ఏపీ ప్ర‌జ‌ల‌కి గొప్ప శుభ‌వార్త‌.. కొత్త రేష‌న్ కార్డుల జారీపైన అదిరిపోయే అప్‌డేట్‌

Rtion Card  మార్చి నుండి..

క్రెడిట్‌ కార్డు తరహాలో క్యూఆర్‌ కోడ్‌తో కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఏపీ మంత్రి నారా లోకేష్ సైతం.. మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో వెల్లడించారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రేషన్ పొందేలా.. డిజిటల్ రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు నారా లోకేష్ Nara Lokesh తెలిపారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు తెలిసేలా డిజిటల్ కార్డులు జారీ చేయనున్నారు.పాత వాటి బదులు కొత్త రేషన్ కార్డు ఇవ్వగానే.. పాత రేషన్ కార్డులతో ఇక పని ఉండదు. కొత్త వాటితోనే పని జరుగుతుంది.

ప్రభుత్వ సచివాలయ ఉద్యోగులే.. రేషన్ కార్డులు ఉన్న ప్రతీ ఇంటికీ వెళ్లి.. కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తారని సమాచారం. అందువల్ల ఈ కార్డుల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరాల్సిన పనిలేదు.కొత్త రేషన్ కార్డుల్లో ఉండే క్యూఆర్ కోడ్ కీలకమైనది. అది చెరిగిపోకుండా జాగ్రత్తగా కార్డును చూసుకోవాలి. ఎందుకంటే.. రేషన్ షాపుకి Ration shop వెళ్లాక, ఆ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తారు. దాంతో.. లబ్దిదారుడి వివరాలు.. రేషన్ డీలర్ ట్యాబ్లెట్‌లో కనిపిస్తాయి.రేష‌న్ కోర్డుల మోసం మ‌రియు న‌కిలీని నిరోధించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది.

జ‌న‌నాలు, మ‌ర‌ణాలు మ‌రియు ఇత‌ర కుటుంబ మార్పుల‌ని స‌మీపంలోని గ్రామం లేదా వార్డు స‌చివాల‌యంలో సుల‌భంగా న‌మోదు చేసుకోవ‌చ్చు. రికార్డుల‌ని న‌వీక‌రించ‌డంలో జాప్యాలు, మాన్యువ‌ల్ లోపాల‌ని త‌గ్గించ‌డంలో కూడా ఇది ఎంతో సాయ‌ప‌డుతుంది. కొత్త‌గా పెళ్లైన జంట‌లు, రేష‌న్ కార్డ్‌ల‌ని Ration Card పేద కుటుంబాలు, పాత కార్డు పొగొట్టుకున్న వ్య‌క్తులకి భ‌ర్తీ కార్డ్ అవ‌స‌రం. రేష‌న్ కార్డ్ కోసం స‌మీప స‌చివాల‌యాన్ని సంద‌ర్శించాలి. కుటుంబ స‌భ్యులంద‌రి ఆధార్ కార్డ్ కాపీలు, వ‌స‌తి ధృవీక‌ర‌ణ ప‌త్రం, పాత రేష‌న్ కార్డ్, ద‌రఖాస్తు ఫార‌మ్ నింపి నిర్ధేశించిన రుసుము చెల్లించాలి. మీ స్మార్ట్ రేష‌న్ కార్డ్ ఐదు ప‌ని దినాల‌లో డెలివ‌రీ చేయ‌బ‌డుతుంది. మార్చి 2024 నుండి కొత్త స్మార్ట్ రేష‌న్ కార్డ్‌లు జారీ చేయ‌డం జ‌రుగుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది