KTR Tweets : కేటీఆర్ వ‌రుస ట్వీట్స్ వ‌ల‌న బీఆర్ఎస్‌కి న‌ష్టం జ‌రుగుతుందా ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

KTR Tweets : కేటీఆర్ వ‌రుస ట్వీట్స్ వ‌ల‌న బీఆర్ఎస్‌కి న‌ష్టం జ‌రుగుతుందా ?

 Authored By ramu | The Telugu News | Updated on :11 February 2025,8:00 pm

ప్రధానాంశాలు:

  •  KTR Tweets : కేటీఆర్ వ‌రుస ట్వీట్స్ వ‌ల‌న బీఆర్ఎస్‌కి న‌ష్టం జ‌రుగుతుందా ?

KTR Tweets : మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ BRS KTR కేటీఆర్ ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో Social Media చాలా యాక్టివ్ అయ్యారు. ఆయ‌న వరుస ట్వీట్లతో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు మాజీ మంత్రి. ఎక్కడా తగ్గేదేలే అన్నట్లు ప్రతీ సమస్యపై ట్విట్టర్‌ వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై మాటల తూటాలు పేలుస్తూనే ఉన్నారు.అయితే తెలంగాణ వ‌చ్చాక కేటీఆర్ మంత్రిగా పదేళ్ళ పాటు పనిచేశారు. మరి సమస్యలు ఎపుడూ ఉంటూనే ఉంటాయి. ఒక సమస్యను విపక్షంగా వీరు చెబితే మీ హయాంలో పది సమస్యలు చెప్పమంటారా అని అధికార కాంగ్రెస్ నేతలు రివర్స్ లో ఎటాక్ చేస్తున్నారు.

KTR Tweets కేటీఆర్ వ‌రుస ట్వీట్స్ వ‌ల‌న బీఆర్ఎస్‌కి న‌ష్టం జ‌రుగుతుందా

KTR Tweets : కేటీఆర్ వ‌రుస ట్వీట్స్ వ‌ల‌న బీఆర్ఎస్‌కి న‌ష్టం జ‌రుగుతుందా ?

KTR Tweets ట్వీట్ల ర‌చ్చ‌..

ఈ క్ర‌మంలో కేటీఆర్ ఇరుక్కు పోతున్నారు. రాజకీయంగా కూడా కేటీఆర్ వేసే ట్వీట్లు కూడా ఎదురు తంతున్నాయని బీఆర్ఎస్ ని బూమరాంగ్ చేస్తున్నాయని అంటున్నారు. రాహుల్ గాంధీ మీద కేటీఆర్ పెట్టిన ట్వీట్ అయితే అభాసుపాలు అయింది అని అంటున్నారు. కాంగ్రెస్ బీజేపీని గెలిపించింది అన్నట్లుగా ట్వీట్ పెట్టి కంగ్రాట్స్ అంటూ రాహుల్ కి చెప్పడం మీద బీఆర్ఎస్ నే అంతా టార్గెట్ చేశారు. నిజానికి కాంగ్రెస్ బీజేపీల మధ్య జాతీయ స్థాయిలో ఎంతటి రాజకీయ వైరం ఉంటుందో అందరికీ తెలుసు. అలాంటిది ఈ ట్వీట్ల ద్వారా కేటీఆర్ కాంగ్రెస్ బీజేపీ ఒక్కటి అని చెప్పాలనుకోవడం కేటీఆర్‌ని అభాసు పాలు అయ్యేలా చేసింద‌ని అంద‌రు ముచ్చ‌టించుకుంటున్నారు.

తెలంగాణాలో Telangana బీజేపీ, బీఆర్ఎస్ ఒకటి అని అంతా డిసైడ్ అయ్యారు.. దానికి ఎన్నో నిదర్శనాలు ఉదంతాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పటిదాకా కేటీఆర్ కానీ బీఆర్ఎస్ నేతలు కానీ బీజేపీ మీద ఒక్క ట్వీట్ కూడా వేయలేదు. బడ్జెట్ సహా అనేక అంశాలలో తెలంగాణాను కేంద్ర ప్రభుత్వం బీజేపీ అన్యాయం చేసినా వాటి మీద నోరు కూడా ఎత్త‌లేదు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం లో చీమ చిటుక్కుమన్నా కూడా కేటీఆర్ ట్విట్టర్ హ్యాండిల్ బిగ్ సౌండ్ చేస్తుందని అంటున్నారు. ట్వీట్లతో వార్ చేయాలనుకుంటే దానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక జనాలు కూడా ఏమీ అమాయకులు కారని అంటున్నారు. వారు ఎవరి హయాంలో ఏమి జరిగింది అన్నది పూర్తిగా తెలుసుకునే ఉన్నారు. మ‌రి రానున్న రోజుల‌లో కేటీఆర్ ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తారా అన్న‌ది చూడాలి.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది