Kadiyam Srihari : ఉప ఎన్నిక‌ల‌పై క‌డియం శ్రీహ‌రి హాట్ కామెంట్స్.. నేను ఎక్క‌డికి పారిపోను..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kadiyam Srihari : ఉప ఎన్నిక‌ల‌పై క‌డియం శ్రీహ‌రి హాట్ కామెంట్స్.. నేను ఎక్క‌డికి పారిపోను..!

 Authored By ramu | The Telugu News | Updated on :10 February 2025,9:00 am

ప్రధానాంశాలు:

  •  Kadiyam Srihari : ఉప ఎన్నిక‌ల‌పై క‌డియం శ్రీహ‌రి హాట్ కామెంట్స్.. నేను ఎక్క‌డికి పారిపోను..!

Kadiyam Srihari : ప్ర‌స్తుతం దేశ రాజ‌కీయాలు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ‌,ఏపీ రాజ‌కీయాలు ఎప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మాజీ మంత్రి కేటీఆర్ KTR సంతోషపడుతున్నారని అన్నారు. ఆప్ ఓడిపోవడానికి బీఆర్ఎస్ పార్టీనే ప్రధాన కారణమని ఆయ‌న మాట్లాడారు ..లిక్కర్ స్కాంతో ఆప్ ఓడిపోయిందని ఆరోపించారు. బీఆర్ఎస్‌తో ఆప్ స్నేహం చేయడంతోనే అధికారం కోల్పోయిందని ఆరోపించారు. ఆప్- కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేస్తే బాగుండేదని అన్నారు. ఆప్ పార్టీ అతిగా ఆలోచించుకొని ఒంటరిగా పోటీ చేసిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు….

Kadiyam Srihari ఉప ఎన్నిక‌ల‌పై క‌డియం శ్రీహ‌రి హాట్ కామెంట్స్ నేను ఎక్క‌డికి పారిపోను

Kadiyam Srihari : ఉప ఎన్నిక‌ల‌పై క‌డియం శ్రీహ‌రి హాట్ కామెంట్స్.. నేను ఎక్క‌డికి పారిపోను..!

Kadiyam Srihari ఉప ఎన్నిక‌ల‌పై కామెంట్..

గ‌త పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. ఎమ్మెల్యే అనర్హత పిటిషన్‌ కోర్టు పరిధిలో ఉందని దీనిపై వచ్చే తీర్పును శిరసావహిస్తానని కడియం శ్రీహరి తెలిపారు. ఉప ఎన్నిక వస్తే పారిపోనని నిలబడి పోరాడతానని వివరించారు. ఫిరాయింపులపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్​కు లేదని ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించింది ఆ పార్టీయేనని కడియం విమర్శించారు. ఎస్సీలకు జనాభా ప్రాతిపదికన 18 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని కడియం శ్రీహరి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ న్యాయస్థానం పరిధిలో ఉంది. ఎవరైనా కోర్టు తీర్పునకు లోబడి ఉండాల్సిందే.

10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో దాదాపు 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకున్నారు. ఆయా పార్టీలకు రాజీనామాలు చేయకుండానే అందులో కొందరు మంత్రులు కూడా అయ్యారు. ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్. ఆ పార్టీకి ఫిరాయింపుల అంశంపై మాట్లాడే నైతిక హక్కు లేదు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్ ఎప్పుడో కోల్పోయిందని, ఆ పార్టీ నేతలు ఓసారి గతంలోకి చూసుకుంటే బాగుంటుందని కడియం శ్రీహరి హితవు పలికారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను మంత్రులను చేసింది బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు. అప్పుడుఫిరాయింపులు ప్రోత్సహించి, ఇప్పుడు శుద్ధపూసల్లా మాట్లాడితే సరిపోతుందా? అని విమర్శించారు. మీరు చేస్తే సంసారం… మరొకరు చేస్తే వ్యభిచారమా? అని నిలదీశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టు విచారణలో ఉందని… దీనిపై ఎలాంటి తీర్పు వచ్చిన పాటిస్తానని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఉప ఎన్నిక వస్తే ధైర్యంగా ఎదుర్కొంటానని అన్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది