Crime News : ఆస్తి తన పేరు మీద రాయడం లేదని.. సొంత భర్తనే కడతేర్చిన భార్య.. ఎక్కడో తెలుసా?
Crime News : ఆస్తిని తన పేరు మీద రాయడానికి భర్త ఒప్పుకోలేదు. దీంతో ఏం చేయాలో ఆ భార్యకు అర్థం కాలేదు. దీంతో తన భర్తను చివరకు చంపేయాలని నిర్ణయించుకుంది. అప్పుడైనా ఆస్తి తన చేతికి వస్తుందని ఆశపడింది. కానీ.. అంతా రివర్స్ అయిపోయింది. చివరకు ఆస్తి పోయి.. భర్త పోయి.. కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది.

man kills his wife for assets and money in telangana
ఈ ఘటన తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతలలో చోటు చేసుకుంది. అయ్యవారిపల్లికి చెందిన సైదయ్య అనే వ్యక్తి వయసు 34. 10 సంవత్సరాల కింద హైదరాబాద్ కు చెందిన సోనీ అనే యువతిని ప్రేమించాడు. పెళ్లి చేసుకున్నాడు. అయితే.. గత సంవత్సరం తనకు ఉన్న వ్యవసాయ భూమిలో ఒక ఎకరాన్ని విక్రయించాడు. దాన్ని రూ.19 లక్షలకు అమ్మాడు. ఆ డబ్బుతో పాటు మిగితా ఆస్తి మొత్తం తనకే చెందుతుందని.. మిగిలిన రెండు ఎకరాలు కూడా తన పేరు మీద రాయాలని తన భార్య సోనీ.. భర్తతో గొడవపడుతూ వస్తోంది.
Crime News : గొంతు నులిమి సైదయ్యను హత్య చేసిన సోనీ తల్లిదండ్రులు
సోనీ తల్లిదండ్రులు కూడా తన ఇంటికి వచ్చారు. అప్పుడు కూడా బాండు పేపర్ పై ఆస్తి మొత్తం పేరు మీద రాయాలని సోనీ.. సైదయ్యతో గొడవ పడింది. అయినా కూడా సైదయ్య రాయడానికి ససేమిరా అన్నాడు. దీంతో సోనీ, ఆమె తల్లిదండ్రులు కలిసి సైదయ్య గొంతు నులిమి హత్య చేశారు. సైదయ్య, సోనీకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి సోదరి ఫిర్యాదుతో తన భార్య, ఆమె తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.