
Manjula Surya : మంజులా సూర్య జ్ఞాపకాల పెట్టెలో ‘నెమలీక’
Manjula Surya : జీవితంలోకి నడిచిన కవిత్వం, చేతిలో చెయ్యేసి చక్కగా ముచ్చట్లు పెట్టిన కవిత్వం, సృజన దాహార్తి తీర్చే కవిత్వం, జ్ఞాపకాల పెట్టెల కవిత్వం, యాదృచ్ఛిక పరిణామాల కవిత్వం ‘నెమలీక’గా ఒక పుస్తక రూపందాల్చి విశిష్ట ముద్రణతో మనల్ని ఆకర్షించే సన్నివేశం హైదరాబాద్ త్యాగరాయగానసభలో దర్శనమిస్తోంది.ఈ అద్భుత సన్నివేశానికి కారణభూతురాలైన నెమలీక కవిత్వ రచయిత్రి మంజులా సూర్యను ఆధునిక ప్రాచీన అభ్యుదయ కవులు మనసా అభినందిస్తున్నారు.
Manjula Surya : మంజులా సూర్య జ్ఞాపకాల పెట్టెలో ‘నెమలీక’
రక రకాల వర్గాలుగా కవిత్వంలో అభ్యుదయ విప్లవ సంప్రదాయ కవులుగా చీలిన నేపథ్యంలోంచి చూస్తే మంజులా సూర్య ఒక వర్గానికి చెందకుండా కేవలం కవిత్వాన్ని తన మనోఫలకం పై తురుముకున్న పోయెట్రీ పీకాక్‌గా మనతో, మన మనస్సుతో కరచాలనం చేస్తూ కనిపిస్తారు.వర్ధమాన కవుల కోసం, వివిధ రంగాలలో రోజూ జరిగే పోటీల్లో విజేతలైనప్రతిభావంతులైన యువతీ యువకులకు బహుమతిగా ఇవ్వడం కోసం హైదరాబాద్ త్యాగరాయగాన సభకు సుమారు వెయ్యి నెమలీక పుస్తకాలను శ్రీమతి మంజులా సూర్య భర్త సంజయ్ కుమార్ పది బాక్స్‌లు అందజేశారని త్యాగరాయగానసభ అధ్యక్షులు కళా జనార్ధన మూర్తి తెలిపారు.
Manjula Surya : మంజులా సూర్య జ్ఞాపకాల పెట్టెలో ‘నెమలీక’
తెలంగాణ పూర్వ శాసన సభాపతి మధుసూదనా చారి, జస్టిస్ కాశీవిశేశ్వరరావు, వంశీ ఆర్ట్ థియేటర్స్ ఫౌండర్ వంశీరామరాజు, హాస్య బ్రహ్మ శంకరనారాయణ వంటి మేధో సమాజం ఈ నెమలీకను చదివి మంజులా సూర్యను ప్రశంసించారని పేర్కొంటూ తమ ముందే కొన్ని పేజీలు అప్పటికప్పుడు చదివిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘మనసు మట్టిని తాకిన అనుభూతి’ని నెమలీకలో స్పష్టంగా మంజులా సూర్య కలిగించారని, మానవీయమూర్తిగా మంజులా సూర్యను ప్రశంసించారు.
Manjula Surya : మంజులా సూర్య జ్ఞాపకాల పెట్టెలో ‘నెమలీక’
ఈ కవిత్వ సంపుటిలో ప్రఖ్యాత సాహితీవేత్తలు ఆచార్య కొలకనూరి ఇనాక్, ఆంధ్రప్రభ సంపాదకులు వై.ఎస్.ఆర్. శర్మ, ప్రముఖ కవి బిక్కి కృష్ణ ముందుమాటలు మంజులాసూర్య కవితా సంపుటిలోకి పాఠకుణ్ణి ప్రయాణింప చేస్తాయని కళా జనార్ధనమూర్తి చెప్పారు.కవులకు, రసజ్ఞులకు ఈ నెమలీకను ఉచితంగా అందివ్వడానికి త్యాగరాయగానసభ సిద్ధంగా ఉందని, ఈ సరస్వతీ సేవలో తమకు భాగస్వామ్యం కల్పించినందుకు ఆయన మంజులా సూర్యకు కృతజ్ఞతలు తెలిపారు.ప్రముఖ ప్రచురణల సంస్థ విశాలాంధ్ర బుక్ హౌస్ వారి అనుబంధ సంస్థ అయిన కోఠిలోని నవ చేతన బుక్ స్టాల్‌లో కవిత్వ సాహిత్య ప్రియుల కోసం ఈ బుక్‌ని వంద రూపాయలకే విక్రయిస్తున్నారు.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.