Errabelli Dayakar Rao : సర్పంచులకు ₹10 లక్షల ఆఫర్ చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్..!!
Errabelli Dayakar Rao : తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ జాతీయ BRS రాజకీయాల్లో కీలకంగా రాణించడానికి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఈనెల 18వ తారీకు ఖమ్మంలో Khammam భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు జరగనున్న ఈ సభకి ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు పలు జాతీయ కీలక రాజకీయ నాయకులు కూడా హాజరవుతున్నారు. కెసిఆర్ kcr జాతీయ రాజకీయాల్లో తన మార్కు చూపించడానికి ఖమ్మం సభని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. దీంతో ఈ సభకు సంబంధించి విజయవంతం కావడానికి పూర్తి బాధ్యతలను పలువురు నేతలకు గులాబీ బాస్ అప్పచెప్పారు.
ఈ క్రమంలో సభకు భారీగా ప్రజలను తరలించడానికి పార్టీ మంత్రులు మరియు ముఖ్య నాయకులు ఆపసోపాలు పడుతున్నారు. దీంతో ఇచ్చిన టార్గెట్ ప్రకారం సభకు ప్రజలను తరలించినట్లయితే సర్పంచులకు తన పంచాయతీ రాజ్ శాఖ నుండి పది లక్షల రూపాయల నిధులు ఇప్పిస్తానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ Errabelli Dayakar Rao… సర్పంచ్ లకు ఆఫర్ అవటం జరిగింది. మహబూబాబాద్ జిల్లాలో మరిపెడ మండల కేంద్రంలో ఖమ్మం సభ కోసం ఏర్పడిన కమిటీలతో మంగళవారం దయాకర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. చిన్న పంచాయతీల నుండి కనీసం 300 మంది పెద్ద పంచాయతీ నుండి 600 మంది తరలించాలని సర్పంచులకు హుకుం జారీ చేయడం జరిగింది. తాను ఇచ్చిన టార్గెట్ చేరుకొని సర్పంచ్ లకు…నిధులు కేటాయించే ప్రసక్తి లేదని కరాకండిగా చెప్పేశారు.
సభకు ప్రజలను తరలించే విషయంలో నిర్లక్ష్యం వహించే సర్పంచులకు.. భవిష్యత్తులో నిధుల విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మరియు ప్రజా, రైతు ప్రభుత్వాన్ని జాతీయస్థాయిలో ఏర్పాటు చేయాలన్నదే అధినేత కెసిఆర్ లక్ష్యమని స్పష్టం చేశారు. దీంతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.