Minister Malla Reddy : తెలంగాణ మంత్రి మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పాలమ్మినా.. పూలు అమ్మిన అంటూ ఫుల్ గా ఫన్ జనరేట్ చేస్తారు. స్టేజీ ఎక్కితే చాలు ఇక మామూలుగా ఉండదు. రచ్చ రచ్చ చేస్తారు. అది పొలిటికల్ మీటింగ్ అయినా.. మరొకటి అయినా.. ఏదైనా సరే ఆ స్టేజీ మీద ఉన్న వాళ్లు, అక్కడికి వచ్చిన వాళ్లు నవ్వుకోవాల్సిందే. తాజాగా మంత్రి మల్లారెడ్డి.. మల్లారెడ్డి హెల్త్ సిటీ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కొడుకు గురించి చెప్పుకొచ్చారు. చదువుకోండి.. చదువుకుంటేనే లైఫ్ లో సక్సెస్ అవుతారు అంటూ చెప్పుకొచ్చాడు మల్లారెడ్డి. పిల్లలు ఆణిముత్యాలు. వాళ్లను పాడు చేసేదే తల్లిదండ్రులు. పిల్లలను గారాబం చేసి పాడు చేస్తారు. కొన్ని చేయాలంటే కొన్ని తగ్గించుకోవాలి. పిల్లలను ఎక్కడికీ తిప్పొద్దు. అలాగే.. స్టూడెంట్స్ కూడా ప్రేమ దోమకు దూరంగా ఉండాలి. ఎంబీబీఎస్ అంటేనే చదువు. అది చదువుతూనే సక్సెస్ అవుతారు. మీకు ఒక ఉదాహరణ చెబుతా. నా కొడుకు స్టోరీనే చెబుతా అని వెనక్కి తిరిగి అక్కడే ఉన్న తన కొడుకు, కోడలు వైపు చూసి చెప్పొచ్చా అని అడుగుతాడు మల్లారెడ్డి. దీంతో ఓకే అన్నట్టుగా తల ఊపుతుంది ఆయన కోడలు.
తన దగ్గర డబ్బులు లేని సమయంలో కూడా ఒక ల్యాండ్ అమ్మి ఎంబీబీఎస్ చదివించా అని చెప్పుకొచ్చాడు మల్లారెడ్డి. ప్రతి రోజు కష్టపడ్డా. మైసూరులో చదివించా. నేను ఏం దాచుకోను. నాకు ఏం అవసరం లేదు. నాకు 70 ఏళ్లు. 47 సంవత్సరాల్లో పాలు అమ్మిన, పూలు అమ్మిన, బోర్ వెల్ నడిపించిన, కాలేజీలు పెట్టిన. రాజకీయాల్లోకి వచ్చినా. పెద్ద సక్సెస్ అయిన. ఇంకేం కావాలి నాకు. రోజు నేను దేవుడికి ఏం మొక్కుతానో తెలుసా? భగవంతుడిని నేను ఏం కోరుకుంటానో తెలుసా? నాకు అన్నీ ఇచ్చిండు. నా కొడుకును చదివించినాక నా కొడుకు అమెరికా పోతా అన్నడు. దీంతో అమెరికాకు ఎందుకు ఇండియాలోనే ఉండు అన్నాను. పీజీ కోసం పోతా అంటే వద్దు అని చెప్పిన. పూణెలో సీటు వస్తే అక్కడికి వెళ్లి పీజీ చేసిండు. అది పూర్తి చేసి అక్కడే నా కోడలు క్లాస్ మెట్. ఒక డాక్టర్ ను చదివిస్తే ఇంకో డాక్టర్ గిఫ్ట్ గా వచ్చింది. వాళ్లకు మంచి లైఫ్ పార్టనర్ దొరికింది. సక్సెస్ ఫుల్ లైఫ్ కదా. రెడ్డి పిల్లను చేసుకుంటే ఎప్పుడూ ఫంక్షన్లు అవీ వెళ్తరు. కానీ.. నా కోడలు మాత్రం ఎప్పుడూ హాస్పిటల్ కు వెళ్తుంది. మెడికల్ కాలేజీని కూడా నడిపిస్తది అని చెప్పుకొచ్చారు మల్లారెడ్డి.
పీజీ చేస్తూ తన క్లాస్ మెట్ అయిన అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకున్నడు నా కొడుకు. భగవంతుడు కష్టపడితేనే మనకు మంచి దారి చూపిస్తాడు. వాళ్లకు మంచి దారి చూపించాడు. సక్సెస్ ఫుల్ లైఫే కదా.. అంటూ తన కొడుకు, కోడలు గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు మల్లారెడ్డి. ఆమె తల్లి,తండ్రి ఇద్దరూ లేరు. ఇప్పుడు ఆమెకు అన్నీ మేమే. అంత పని చేస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు మల్లారెడ్డి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.