Minister Malla Reddy : చదువుకోరా అంటే నా కొడుకు భార్యను తీసుకొచ్చి పరిచయం చేశాడు.. మల్లారెడ్డి కామెడీ చూస్తే నవ్వు ఆగదు | The Telugu News

Minister Malla Reddy : చదువుకోరా అంటే నా కొడుకు భార్యను తీసుకొచ్చి పరిచయం చేశాడు.. మల్లారెడ్డి కామెడీ చూస్తే నవ్వు ఆగదు

Minister Malla Reddy : తెలంగాణ మంత్రి మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పాలమ్మినా.. పూలు అమ్మిన అంటూ ఫుల్ గా ఫన్ జనరేట్ చేస్తారు. స్టేజీ ఎక్కితే చాలు ఇక మామూలుగా ఉండదు. రచ్చ రచ్చ చేస్తారు. అది పొలిటికల్ మీటింగ్ అయినా.. మరొకటి అయినా.. ఏదైనా సరే ఆ స్టేజీ మీద ఉన్న వాళ్లు, అక్కడికి వచ్చిన వాళ్లు నవ్వుకోవాల్సిందే. తాజాగా మంత్రి మల్లారెడ్డి.. మల్లారెడ్డి హెల్త్ సిటీ ఈవెంట్ లో […]

 Authored By kranthi | The Telugu News | Updated on :7 November 2023,6:00 pm

ప్రధానాంశాలు:

  •  స్టేజీ మీదే కొడుకు, కోడలు లవ్ గురించి చెప్పుకొచ్చిన మల్లారెడ్డి

  •  ముఖం దాచుకున్న కోడలు ప్రీతి రెడ్డి

  •  సోషల్ మీడియాలో వీడియో వైరల్

Minister Malla Reddy : తెలంగాణ మంత్రి మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పాలమ్మినా.. పూలు అమ్మిన అంటూ ఫుల్ గా ఫన్ జనరేట్ చేస్తారు. స్టేజీ ఎక్కితే చాలు ఇక మామూలుగా ఉండదు. రచ్చ రచ్చ చేస్తారు. అది పొలిటికల్ మీటింగ్ అయినా.. మరొకటి అయినా.. ఏదైనా సరే ఆ స్టేజీ మీద ఉన్న వాళ్లు, అక్కడికి వచ్చిన వాళ్లు నవ్వుకోవాల్సిందే. తాజాగా మంత్రి మల్లారెడ్డి.. మల్లారెడ్డి హెల్త్ సిటీ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కొడుకు గురించి చెప్పుకొచ్చారు. చదువుకోండి.. చదువుకుంటేనే లైఫ్ లో సక్సెస్ అవుతారు అంటూ చెప్పుకొచ్చాడు మల్లారెడ్డి. పిల్లలు ఆణిముత్యాలు. వాళ్లను పాడు చేసేదే తల్లిదండ్రులు. పిల్లలను గారాబం చేసి పాడు చేస్తారు. కొన్ని చేయాలంటే కొన్ని తగ్గించుకోవాలి. పిల్లలను ఎక్కడికీ తిప్పొద్దు. అలాగే.. స్టూడెంట్స్ కూడా ప్రేమ దోమకు దూరంగా ఉండాలి. ఎంబీబీఎస్ అంటేనే చదువు. అది చదువుతూనే సక్సెస్ అవుతారు. మీకు ఒక ఉదాహరణ చెబుతా. నా కొడుకు స్టోరీనే చెబుతా అని వెనక్కి తిరిగి అక్కడే ఉన్న తన కొడుకు, కోడలు వైపు చూసి చెప్పొచ్చా అని అడుగుతాడు మల్లారెడ్డి. దీంతో ఓకే అన్నట్టుగా తల ఊపుతుంది ఆయన కోడలు.

తన దగ్గర డబ్బులు లేని సమయంలో కూడా ఒక ల్యాండ్ అమ్మి ఎంబీబీఎస్ చదివించా అని చెప్పుకొచ్చాడు మల్లారెడ్డి. ప్రతి రోజు కష్టపడ్డా. మైసూరులో చదివించా. నేను ఏం దాచుకోను. నాకు ఏం అవసరం లేదు. నాకు 70 ఏళ్లు. 47 సంవత్సరాల్లో పాలు అమ్మిన, పూలు అమ్మిన, బోర్ వెల్ నడిపించిన, కాలేజీలు పెట్టిన. రాజకీయాల్లోకి వచ్చినా. పెద్ద సక్సెస్ అయిన. ఇంకేం కావాలి నాకు. రోజు నేను దేవుడికి ఏం మొక్కుతానో తెలుసా?  భగవంతుడిని నేను ఏం కోరుకుంటానో తెలుసా? నాకు అన్నీ ఇచ్చిండు. నా కొడుకును చదివించినాక నా కొడుకు అమెరికా పోతా అన్నడు. దీంతో అమెరికాకు ఎందుకు ఇండియాలోనే ఉండు అన్నాను. పీజీ కోసం పోతా అంటే వద్దు అని చెప్పిన. పూణెలో సీటు వస్తే అక్కడికి వెళ్లి పీజీ చేసిండు. అది పూర్తి చేసి అక్కడే నా కోడలు క్లాస్ మెట్. ఒక డాక్టర్ ను చదివిస్తే ఇంకో డాక్టర్ గిఫ్ట్ గా వచ్చింది. వాళ్లకు మంచి లైఫ్ పార్టనర్ దొరికింది. సక్సెస్ ఫుల్ లైఫ్ కదా. రెడ్డి పిల్లను చేసుకుంటే ఎప్పుడూ ఫంక్షన్లు అవీ వెళ్తరు. కానీ.. నా కోడలు మాత్రం ఎప్పుడూ హాస్పిటల్ కు వెళ్తుంది. మెడికల్ కాలేజీని కూడా నడిపిస్తది అని చెప్పుకొచ్చారు మల్లారెడ్డి.

Minister Malla Reddy : పీజీ చేస్తూ లవ్ చేసి పెళ్లి చేసుకున్నడు

పీజీ చేస్తూ తన క్లాస్ మెట్ అయిన అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకున్నడు నా కొడుకు. భగవంతుడు కష్టపడితేనే మనకు మంచి దారి చూపిస్తాడు. వాళ్లకు మంచి దారి చూపించాడు. సక్సెస్ ఫుల్ లైఫే కదా.. అంటూ తన కొడుకు, కోడలు గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు మల్లారెడ్డి. ఆమె తల్లి,తండ్రి ఇద్దరూ లేరు. ఇప్పుడు ఆమెకు అన్నీ మేమే. అంత పని చేస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు మల్లారెడ్డి.

kranthi

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక

Polls

తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌స్తే ఎవ‌రిని సీఎం చేసే అవ‌కాశం ఉంది..?

View Results

Loading ... Loading ...