
#image_title
New Ration Cards : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక అనేక సంస్కరణలు చేపడుతుండడం మనం చూస్తున్నాం. ఇటీవల రైతులకి కూడా గుడ్ న్యూస్ చెప్పారు. వారి అకౌంట్‌లో విడతల వారీగా డబ్బులు వేస్తున్నారు. ఇక కొద్ది రోజులుగా రేషన్ కార్డుల కోసం అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలోని అర్హులందరికీ రేషన్‌కార్డులు ఇవ్వనున్నట్లు పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆగస్టు 1వ తేదీన కేబినెట్భేటీలో విధివిధానాలు ఖారారు చేస్తామని చెప్పారు. త్వరలో రేషన్‌కార్డులపై సన్నబియ్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారందరికీ రూ.500 సిలిండర్ఇస్తామని స్పష్టం చేశారు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రేషన్‌కార్డుపై అడిగిన ప్రశ్నకు పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. అసెంబ్లీలో పౌర సరఫరాల శాఖ పద్దులపై వాడివేడి చర్చలు జరిగిన సమయంలో మాజీ మంత్రి కేసీఆర్చర్యలతో రాష్ట్రంలో ధాన్యం గణనీయంగా పెరిగిందని బీఆర్ఎస్ఎమ్మెల్యే గంగుల కమలాకర్తెలిపారు. పౌరసరఫరాల శాఖ ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయలేదని చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల కోసం గ్లోబల్టెండర్లు ఎందుకు పిలవలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొత్త రేషన్ కార్డులు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ సమాధానమిచ్చారు.
తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా యువతకు అధునాతన పరిజ్ఞానం అందించడంతో పాటు నైపుణ్యాలను పెంపొందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్సిటీ బిల్లును ఆయన శాసనసభలో ప్రవేశ పెట్టారు. ఇక ఇదిలా ఉంటే.. ప్రభుత్వ పథకాలు రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో చాలా మంది ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా పింఛన్ రావాలన్నా.. గ్యాస్ సబ్సిడీ కావాలన్నా, ఉచిత విద్యుత్ పొందలన్నా రేషన్ కార్డు అవసరం. అందుకే లక్షలాది మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు
Blue Berries : మార్కెట్లో మనకు అనేక రకాల పండ్లు సులభంగా దొరుకుతుంటాయి. అయితే వాటిలో కొన్ని పండ్లను మాత్రమే…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గులాబీ పార్టీపై చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మరింత…
Gautam Gambhir : టీమ్ ఇండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా…
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు.…
KCC Loan for Farmers : దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆర్థికంగా బలపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక…
LPG Gas Cylinder 2026: దేశమంతటా LPG Gas Cylinder వినియోగించే కుటుంబాలకు ఇది నిజంగా శుభవార్త. రోజురోజుకు డిజిటల్…
Father and Daughter Love: సోషల్ మీడియాలో ఇటీవల వైరల్‌గా మారిన ఓ వీడియో లక్షలాది మంది నెటిజన్ల కళ్లను…
This website uses cookies.