New Ration Cards : కొత్త రేష‌న్ కార్డుల‌పై మంత్రి ఉత్త‌మ్ కీల‌క ప్ర‌క‌టన‌.. ఛాన్స్ మిస్ చేసుకోవ‌ద్దు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

New Ration Cards : కొత్త రేష‌న్ కార్డుల‌పై మంత్రి ఉత్త‌మ్ కీల‌క ప్ర‌క‌టన‌.. ఛాన్స్ మిస్ చేసుకోవ‌ద్దు…!

 Authored By ramu | The Telugu News | Updated on :31 July 2024,12:14 pm

New Ration Cards  : తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొలువుదీరాక అనేక సంస్క‌ర‌ణ‌లు చేప‌డుతుండ‌డం మ‌నం చూస్తున్నాం. ఇటీవ‌ల రైతుల‌కి కూడా గుడ్ న్యూస్ చెప్పారు. వారి అకౌంట్‌లో విడ‌త‌ల వారీగా డబ్బులు వేస్తున్నారు. ఇక కొద్ది రోజులుగా రేష‌న్ కార్డుల కోసం అందరు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న స‌మ‌యంలో గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలోని అర్హులందరికీ రేషన్​కార్డులు ఇవ్వనున్నట్లు పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి తెలిపారు. ఆగస్టు 1వ తేదీన కేబినెట్​భేటీలో విధివిధానాలు ఖారారు చేస్తామని చెప్పారు. త్వరలో రేషన్​కార్డులపై సన్నబియ్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. తెల్ల రేషన్​కార్డు ఉన్నవారందరికీ రూ.500 సిలిండర్​ఇస్తామని స్పష్టం చేశారు.

New Ration Cards : రేష‌న్ కార్డ్‌పై అప్‌డేట్..

అసెంబ్లీలో బీఆర్​ఎస్​ఎమ్మెల్యే గంగుల కమలాకర్​ రేషన్​కార్డుపై అడిగిన ప్రశ్నకు పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్​రెడ్డి సమాధానం ఇచ్చారు. అసెంబ్లీలో పౌర సరఫరాల శాఖ పద్దులపై వాడివేడి చర్చలు జరిగిన స‌మ‌యంలో మాజీ మంత్రి కేసీఆర్​చర్యలతో రాష్ట్రంలో ధాన్యం గణనీయంగా పెరిగిందని బీఆర్​ఎస్​ఎమ్మెల్యే గంగుల కమలాకర్​తెలిపారు. పౌరసరఫరాల శాఖ ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయలేదని చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల కోసం గ్లోబల్​టెండర్లు ఎందుకు పిలవలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొత్త రేషన్ కార్డులు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ సమాధానమిచ్చారు.

తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా యువతకు అధునాతన పరిజ్ఞానం అందించడంతో పాటు నైపుణ్యాలను పెంపొందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్సిటీ బిల్లును ఆయన శాసనసభలో ప్రవేశ పెట్టారు. ఇక ఇదిలా ఉంటే.. ప్రభుత్వ పథకాలు రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో చాలా మంది ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా పింఛన్ రావాలన్నా.. గ్యాస్ సబ్సిడీ కావాలన్నా, ఉచిత విద్యుత్ పొందలన్నా రేషన్ కార్డు అవసరం. అందుకే లక్షలాది మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది