Mynampally Hanumantha Rao : అరేయ్ బఫూన్.. మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డిపై మైనంపల్లి బూతు పురాణం.. వీడియో వైరల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mynampally Hanumantha Rao : అరేయ్ బఫూన్.. మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డిపై మైనంపల్లి బూతు పురాణం.. వీడియో వైరల్

Mynampally Hanumantha Rao : మైనంపల్లి హన్మంతరావు తెలుసు కదా. మొన్నటి దాకా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆయనకు మళ్లీ అదే మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి టికెట్ కేటాయించింది. కానీ.. టికెట్ కేటాయించినా బీఆర్ఎస్ పార్టీ నేతలపై పలు విమర్శలు చేశారు మైనంపల్లి. మంత్రి హరీశ్ రావుపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. తన కొడుక్కి మెదక్ టికెట్ కావాలని అధిష్ఠానాన్ని కోరినా ఇవ్వకపోవడంతో ఇదంతా హరీశ్ రావు చేయించారంటూ ఆయనపై మండిపడ్డారు. దీంతో […]

 Authored By kranthi | The Telugu News | Updated on :3 November 2023,12:20 pm

ప్రధానాంశాలు:

  •  మంత్రి మల్లారెడ్డిపై మైనంపల్లి సీరియస్

  •  ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం

  •  నీకు డ్యాన్స్ తప్ప ఇంకేం చేతగాదు

Mynampally Hanumantha Rao : మైనంపల్లి హన్మంతరావు తెలుసు కదా. మొన్నటి దాకా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆయనకు మళ్లీ అదే మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి టికెట్ కేటాయించింది. కానీ.. టికెట్ కేటాయించినా బీఆర్ఎస్ పార్టీ నేతలపై పలు విమర్శలు చేశారు మైనంపల్లి. మంత్రి హరీశ్ రావుపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. తన కొడుక్కి మెదక్ టికెట్ కావాలని అధిష్ఠానాన్ని కోరినా ఇవ్వకపోవడంతో ఇదంతా హరీశ్ రావు చేయించారంటూ ఆయనపై మండిపడ్డారు. దీంతో మైనంపల్లి పార్టీ మారుతారని ఊహాగానాలు వినిపించాయి. దానికి తగ్గట్టుగానే మైనంపల్లి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి మైనంపల్లి బీఆర్ఎస్ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి, హరీశ్ రావు, ఇతర నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

దీంతో బీఆర్ఎస్ నేతలు కూడా మైనంపల్లిపై ఎదురుదాడి చేస్తున్నారు. మైనంపల్లి గతాన్ని తవ్వి తీస్తున్నారు. దీంతో మంత్రి మల్లారెడ్డిపై బూతు పురాణం అందుకున్నాడు మైనంపల్లి హన్మంతరావు. బఫూన్ మంత్రి అని మల్లారెడ్డిపై విరుచుకుపడ్డారు. చదువురాని దద్దమ్మలకు మంత్రి పదవి ఇస్తే ఇలాగే ఉంటది అంటూ మండిపడ్డారు. చదువు రాని కల్చర్ లెస్ ఫెలో ఎలా మాట్లాడుతున్నాడో చూడండి అంటూ దుయ్యబట్టారు. వాడు ఏం మాట్లాడుతాడో తెలియదు. మళ్లీ ఏజ్ ను గౌరవించాలి అంటాడు. కానీ.. ఏజ్ కి తగ్గట్టుగా మాట్లాడడు. నన్ను రెచ్చగొట్టకు. ఎందుకు రెచ్చగొడుతున్నావు. నీ స్థాయి నా స్థాయి కాదురా. బచ్చాగాడివి పాలిటిక్స్ లో అంటూ మండిపడ్డారు మైనంపల్లి. నా గురించి మాట్లాడుతున్నావు. నీకు కామన్ సెన్స్ ఉందా? నేను స్కూల్ టైమ్ లో స్కూల్ టీమ్ ను లీడ్ చేశా. స్పోర్ట్స్ లో నెంబర్ వన్ నేను. చెత్త నా కొడకా.. నువ్వు ఎంపీగా ఉండి ఏం చేశావు చెప్పు అంటే మైనంపల్లి గురించి మాట్లాడుతావేంటిరా అంటూ మల్లారెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

మైనం పిల్లి అని నువ్వే అంటవు.. మైనంపల్లికి భయపడుతున్నా అంటవు. దమ్కీ ఇచ్చిన అంటవు. ఒక డ్యాన్సులు తప్ప యూజ్ లెస్ ఫెలో నీకు ఏం రావు. పాలు అమ్మిన, పూలు అమ్మిన అంటవు. నీకేమన్నా సబ్జెక్ట్ ఉందా అసలు. మంత్రి పదవి ఇచ్చింది నా గురించి మాట్లాడేందుకా? నీలాంటోడిని తిట్టకపోతే జనాలు ఏమనుకుంటరు. మైనంపల్లికి చేతకాదు అనుకుంటరు. నీ ముఖం ఒకసారి అద్దంలో చూసుకో. నా గురించి ఎందుకు మాట్లాడుతవు. హరీశ్ తో పాటు మల్లారెడ్డి కూడా జైలుకు పోవడం ఖాయం. నలుగురుని పట్టుకొని తిరగ్గానే కాదు. నాకంటే నువ్వు ఫాస్ట్ గా నడువు. మల్కాజిగిరి ప్రజలకు నేను కోరుతున్నా. నాతో పాటు నడువు. నేను ఈరోజు మల్కాజిగిరిని కరప్షన్ ఫ్రీ చేసిన అంటూ మైనంపల్లి మండిపడ్డారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది