KCR : తెలంగాణా టెంపరరీ CM గా కెసిఆర్ ?

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 5 July 2026, 4:40 pm
  •  KCR : తెలంగాణా టెంపరరీ CM గా కెసిఆర్ ?

KCR  : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు, గోదావరి జలాల వినియోగంపై రాజకీయ వేడి మరింత పెరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణలో విఫలమైందని ఆరోపించిన ఆయన, “చేతకాకపోతే కేవలం వారం రోజుల పాటు కాళేశ్వరం బాధ్యతలను కేసీఆర్‌కు అప్పగించండి.. రాష్ట్రంలోని అన్ని జలాశయాలను నీటితో నింపి చూపిస్తాం” అంటూ వ్యాఖ్యానించారు.కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటనకు బయలుదేరిన కేటీఆర్‌ను పోలీసులు అడ్డుకోవడం, ఆ తర్వాత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

KCR : తెలంగాణా టెంపరరీ CM గా కెసిఆర్ ?

KCR : తెలంగాణా టెంపరరీ CM గా కెసిఆర్ ?KCR : తెలంగాణా టెంపరరీ CM గా కెసిఆర్ ?

KCR  : కాళేశ్వరం జలాలపై కాంగ్రెస్‌ను టార్గెట్ చేసిన కేటీఆర్

జనగామ జిల్లాలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ప్రస్తుతం గోదావరిలో సమృద్ధిగా నీరు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సాగునీరు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు.కన్నెపల్లి పంప్ హౌస్‌లో కనీసం ఒక పంప్‌ను ఆన్ చేసినా భారీగా నీటిని పైప్రాంతాలకు తరలించే అవకాశం ఉందని, కానీ ప్రభుత్వం కావాలనే ఆ పని చేయడం లేదని అన్నారు.ఆయన మాటల్లో.. ప్రస్తుతం గోదావరి వరద నీరు లక్షల క్యూసెక్కుల చొప్పున సముద్రంలో కలుస్తోందని, అదే నీటిని జలాశయాలకు మళ్లిస్తే వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు.

KCR  “వారం రోజులు కేసీఆర్‌కు అప్పగించండి”

ప్రభుత్వం ప్రాజెక్టులను సమర్థవంతంగా నిర్వహించలేకపోతే రాజకీయాలను పక్కనబెట్టి రైతుల ప్రయోజనాల కోసం నిర్ణయం తీసుకోవాలని కేటీఆర్ సూచించారు.”వారం రోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను మాజీ సీఎం కేసీఆర్‌కు అప్పగించండి. అన్ని పంపులను ఆన్ చేసి, రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలన్నింటినీ నింపి, ప్రతి ఎకరానికి సాగునీరు అందించి చూపిస్తాం” అని ఆయన సవాల్ విసిరారు.ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

KCR  కన్నెపల్లి పర్యటనకు అడ్డంకులు.. పోలీసులపై ఆగ్రహం

కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్‌ను సందర్శించేందుకు బయలుదేరిన కేటీఆర్ కాన్వాయ్‌ను పోలీసులు జనగామ జిల్లా పెంబర్తి, కొమల్ల చెక్‌పోస్ట్, టోల్‌గేట్ ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి నిలిపివేశారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు, పోలీసులు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సహా పలువురు నేతలు పోలీసుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించగా, పై అధికారుల ఆదేశాల మేరకే చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు చెప్పారని కేటీఆర్ తెలిపారు.

ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే భయమేనా?

కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలు ప్రజలకు తెలిసిపోతాయనే భయంతోనే పోలీసులను వినియోగించి తమ పర్యటనను అడ్డుకుంటోందని కేటీఆర్ ఆరోపించారు.కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద పరిస్థితులను రైతులు ప్రత్యక్షంగా చూస్తే ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడుతుందని ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు.అయితే ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతుల కోసం పోరాటం కొనసాగుతుందని, కన్నెపల్లికి వెళ్లి వాస్తవ పరిస్థితులను ప్రజలకు చూపిస్తామని స్పష్టం చేశారు.

రైతులకు నీళ్లు ఇవ్వడం ఇష్టం లేదా?

కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం గోదావరిలో నీటి మట్టం 93.5 మీటర్ల వద్ద ఉందని, ఈ పరిస్థితిలో మేడిగడ్డ బ్యారేజ్‌తో సంబంధం లేకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందన్నారు.అయినా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.”రైతులకు నీళ్లు ఇస్తే యూరియా, బోనస్, మద్దతు ధర వంటి హామీలు కూడా అమలు చేయాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే ప్రభుత్వం నీటిని వృథాగా సముద్రంలోకి వదిలేస్తోంది” అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

బీఆర్ఎస్ శ్రేణుల ఘన స్వాగతం

కేటీఆర్ పర్యటన సందర్భంగా స్టేషన్ ఘనపూర్ సహా పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.పూల వర్షం కురిపిస్తూ, టపాసులు పేలుస్తూ, “సీఎం.. సీఎం” అంటూ నినాదాలు చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.మరోవైపు పర్యటన నేపథ్యంలో వరంగల్, జనగామ జిల్లాల్లో పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం కూడా చర్చనీయాంశమైంది.

రాజకీయంగా వేడెక్కుతున్న కాళేశ్వరం వివాదం

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ, గోదావరి వరద జలాల వినియోగం, రైతులకు సాగునీరు అందించే అంశాలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతమవుతోంది.కేటీఆర్ విసిరిన తాజా సవాల్‌కు కాంగ్రెస్ నాయకత్వం ఎలా స్పందిస్తుందో, ప్రభుత్వం కాళేశ్వరం నిర్వహణపై ఎలాంటి వివరణ ఇస్తుందో ఆసక్తికరంగా మారింది.రాబోయే రోజుల్లో ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో మరింత చర్చకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp