Nandamuri suhasini : తెలుగుదేశం పార్టీలో నందమూరి కుటుంబానికి ఖచ్చితంగా ప్రత్యేకమైన హోదా అనేది ఉంటుంది. అయితే తాజాగా ఎన్టీఆర్ మనవరాలు చంద్రబాబు మేనకోడలు జూనియర్ ఎన్టీఆర్ అక్క అయిన నందమూరి సుహాసిని తెలంగాణ నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ తన రాజకీయ అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోనున్నారు. వాస్తవానికి నందమూరి సుహాసిని 2018 లోనే రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పుడు ఆమె టీడీపీ తరఫున కూకట్ పల్లి నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ సమయంలో టీడీపీ మరియు కాంగ్రెస్ పార్టీ కూటమిగా వచ్చినప్పటికి బీఆర్ఎస్ అధికారం సాధించింది.
అనంతరం 2023లో టిడిపి తరఫున తెలంగాణ ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు. ఇక ఆ సందర్భంలో సుహాసిని రాజకీయంగా ఎక్కడ కనిపించలేదు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుండి టీడీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారన్న వార్తలు బాగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె గన్నవరం నియోజకవర్గ నుండి బరిలో దిగుతారని ప్రచారాలు జరిగాయి. అదేవిధంగా ఎన్టీఆర్ సొంత గడ్డ గుడివాడ నియోజకవర్గం నుండి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని కి పోటీగా ఆమె సిద్ధమవుతారని అంతా అనుకున్నాను.
కానీ అందరూ అనుకున్నట్లుగా అవేమీ జరగలేదు. ఈ తరణంలోనే సడన్ గా ఆమె తెలంగాణ రాజకీయ అరంగేట్రంపై వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇటీవల ఆమె కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ అయినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ భేటీ వెనుక చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్ ఉందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. టీడీపీ పార్టీలో ఉన్న తన మేనకోడలిని చంద్రబాబు కాంగ్రెస్ వైపు నడిపిస్తున్నారని పలువురు చెబుతున్నారు. అంతేకాక రేవంత్ రెడ్డి ఒకప్పుడు టీడీపీ నాయకుడు కావడంతో ఆయన పార్టీలోకి నందమూరి సుహాసినిని ఆహ్వానిస్తే మేలు జరిగే అవకాశాలు ఉన్నందున ఆమెను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తే ఎందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అలాగే తెలంగాణలో నందమూరి ఫ్యామిలీకి మరొక అవకాశం దొరికినట్లుగా అవుతుందని ఇక ఇది తెలుగుదేశం పార్టీకి ఎలాగైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చంద్రబాబు మేనకోడలిను కాంగ్రెస్ వైపుగా నడిపిస్తున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం జగుతున్నాయి.
అయితే తెలంగాణలో కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు ఖమ్మంలో ఎంపీ టికెట్ ను ఇచ్చేందుకు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖమ్మం అనేది కంచుకోట. ఇవాళ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటి తప్ప అన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. 2019లో మాత్రం ఖమ్మం జిల్లాలో ఎంపీ సీటు బీఆర్ఎస్ గెలుస్తుంది. అయితే కాంగ్రెస్ అసెంబ్లీ సీట్లు బాగానే వస్తున్నప్పటికీ ఎంపీ సీట్లు మాత్రం ప్రతిసారి బీఆర్ఎస్ అందుకు పోతోంది. ఈ నేపథ్యంలోనే ఈసారి ఆలోచించి ఖమ్మం అభ్యర్థులను దించాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. అలాగే ఈసారి లోక్ సభ ఖమ్మం సీట్ కచ్చితంగా కాంగ్రెస్ కి వస్తుందని ఆ పార్టీలో పెద్ద ఎత్తున పోటీ కూడా కొనసాగుతుంది. ఇలాంటి తరుణంలో నందమూరి సుహాసిని కి ఈ సీట్ దక్కుతుందో లేదో వేచి చూడాల్సిందే.
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
This website uses cookies.