Breakfast : వీటిని అల్పాహారంలో తీసుకుంటే.. ఆ సమస్యలన్నీ మాయం...!
Breakfast : ప్రస్తుతం చాలామంది బిజీ లైఫ్ కారణంగా ఆహారాల్లో మార్పులు చేసుకుంటూ ఉన్నారు. అంటే ఉదయం అల్పాహారం తీసుకోవడం మానేస్తుంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు తమ డైట్లో అల్పాహారం స్కిప్ చేస్తూ ఉంటారు. ఇంకొందరు బరువు తగ్గాలని ఉద్దేశంతో బ్రేక్ ఫాస్ట్ కి దూరంగా ఉంటూ ఉంటారు. అయితే ఆరోగ్యంగా ఉండాలన్న రోజంతా ఉత్సాహంగా పని చేయాలన్న అల్పాహారం తినడం చాలా ముఖ్యం. అలాగే తీసుకునే అల్పాహారం పోషకాలు తో నిండి ఉండడం కూడా అంతే అవసరం. చాలామంది ఆకలి తీర్చుకోవడానికి అల్పాహారంలో ఏదో ఒకటి తింటూ ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే ఆహారం మీ అల్పాహారంలో చేర్చుకుంటే అనేక జబ్బుల్ని తగ్గించుకోవచ్చు. మరి ఆహారం ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు..
అల్పాహారంలో ప్రోటీన్ ఫుడ్ తప్పకుండా ఉండాలి.అంటే పాలు, నట్స్, గుడ్డు, మొలకలు లాంటివి తీసుకుంటే ప్రోటీన్ శరీరానికి బాగా అందుతుంది.దాని ఫలితంగా మీతో పాటు మీ మెదడు కూడా రోజంతా యాక్టివ్గా ఉత్సాహంగా ఉంటుంది. ఎముకలు కండరాలు దృఢంగా మారుతాయి. అయితే ప్రతిరోజు ఉదయం అల్పాహారంలో ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే ఎసిడిటీ సమస్య తగ్గుతుంది. అల్పాహారంలో ఓట్ మిల్ చేర్చుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే అధిక బరువును మరియు అధిక ఆకలని తగ్గించడంలో ఓట్ మిల్ ప్రభావంతంగా పనిచేస్తుంది.
అల్పాహారంలో బ్రౌన్ బ్రెడ్ ని కూడా తీసుకోవచ్చు.. ఫైబర్ అధికంగా ఉండడం వల్ల బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. అలాగే అల్పాహారంలో అవకాడోను కూడా తీసుకోవచ్చు. అవకాడోల్లో ఉండే పోషకాలు అలసట నీరసం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. ఇక వీటితో పాటు జొన్న రొట్టెలు, రాగి దోశలు, రాగిజావ, పొద్దు తిరుగుడు విత్తనాలు లాంటివి అల్పాహారంలో తప్పకుండా యాడ్ చేసుకోవాలి. ఇలా ఆడ్ చేసుకుంటే మలబద్ధక సమస్య నుంచి బయటపడవచ్చు.. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయి. అధిక బరువు కూడా చెక్ పెట్టవచ్చు. ఎలాంటి అనారోగ్యమైన సరే అల్పాహారంలో వీటిని ఆడ్ చేసుకుంటే పూర్తిగా తగ్గుతాయి. ఇక మీరు హాస్పటల్ కి వెళ్లాల్సిన అవసరం కూడా రాదు..
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
This website uses cookies.